Corona: హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 10 మందికి కరోనా.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుడు
Corona: కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. గత ఏడాదికిపైగా విజృంభించి తగ్గుముఖం పట్టినా కరోనా మరోసారి విజృంభించేందుకు సిద్ధమవుతోంది. ఇక సౌతాఫ్రికాలో భయపడ్డ కొత్త వేరియంట్‌తో భయాందోళనకు
Corona: కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. గత ఏడాదికిపైగా విజృంభించి తగ్గుముఖం పట్టినా కరోనా మరోసారి విజృంభించేందుకు సిద్ధమవుతోంది. ఇక సౌతాఫ్రికాలో భయపడ్డ కొత్త వేరియంట్‌తో భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 10 మందికి కరోనా పాజిటివ్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వల్ల మిగతా వారికి సోకినట్లు తెలుస్తోంది.
అయితే అపార్ట్‌మెంట్‌లో అందరికీ రేపు కరోనా పరీక్షలు నిర్వహించనన్నారు. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. విషయం తెలిసిన అక్కడి మున్సిపల్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. అపార్ట్‌మెంట్‌లో శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టారు అధికారులు.
ఇంకా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతాయోనని భయాందోళన నెలకొంది. ఇప్పటికే భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నాలుగుకు చేరింది. ఇక మెల్లమెల్లగా కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుండటంతో భయాందోళన నెలకొంది. సౌతాఫ్రికా వేరియంట్ వల్ల కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
ఇవి కూడా చదవండి: