Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid effect: యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌పై కరోనా ఎఫెక్ట్.. సొంతూళ్లకు వెళ్లిపోయిన కార్మికులు.. ప్లాంట్ పరిసరాల్లో కోవిడ్ ఆసుపత్రి

కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ నిర్మాణంపై కూడా పడింది.

Covid effect: యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌పై కరోనా ఎఫెక్ట్.. సొంతూళ్లకు వెళ్లిపోయిన కార్మికులు.. ప్లాంట్ పరిసరాల్లో కోవిడ్ ఆసుపత్రి
Yadadri Thermal Power Plant Construction
Follow us
Balaraju Goud

|

Updated on: May 19, 2021 | 7:30 PM

Corona effect on Yadadri Power Plant: కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ నిర్మాణంపై కూడా పడింది. కరోనా వైరస్ ప్రబలుతుండటంతో కార్మికులు వెళ్లిపోయారు. దీంతో నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులపై కరోనా ప్రభావం పడింది. కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో పనులు మందగించాయి. లాక్ డౌన్ ప్రభావం పవర్ ప్లాంట్ పనులు లక్ష్యంపై తీవ్రంగా పడింది. థర్మల్ ఫ్లాంట్ నిర్మాణం కోసం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఆరువేల ఐదు వందల మంది కార్మికులు పని చేస్తున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సుమారు 5వేల మంది కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు.

దీంతో ఎక్కువ మంది కార్మికులు సడెన్‌గా వెళ్లిపోవడంతో పవర్‌ ప్లాంట్‌ పనులపై తీవ్ర ఎఫెక్ట్ పడింది. పనులు స్పీడ్‌ తగ్గింది. విషయం తెలుసుకున్న అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పనుల వేగం తగ్గకుండా దిద్దుబాటు చర్యలకు దిగారు. కార్మికులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వారిలో భయాన్ని పోగొట్టే యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. వారితో సంప్రదింపులు జరిపి వెనక్కు రప్పించేందుకు ఫ్లాన్ చేశారు.

మరోవైపు మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకు థర్మల్ పవర్ ప్లాంట్ పరిసరాల్లోనే 20 పడకల కోవిడ్ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేశారు. గతేడాది సడెన్ లాక్‌డౌన్‌తో ఇక్కడి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సొంతూరు వెళ్లేందుకు ట్రాన్స్‌పోర్టు లేకపోయింది. అందుకే ఈసారి లాక్‌డౌన్‌ అనే ప్రచారం రాకముందే కార్మికులు సర్దేసుకున్నారు. గత అనుభవం దృష్టిలో పెట్టుకొని ముందే సొంతూళ్లకు వెళ్లిపోయారు. కరోనా కారణంగా ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం మార్చుకోవాల్సి వచ్చింది.

ఇదిలావుంటే, ఈ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను 2022లో వినియోగంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పనులు చాలా స్పీడ్‌గా సాగుతున్న టైంలో గతేడాది కరోనా దెబ్బ తీసింది. ఆ ఎఫెక్ట్‌తో ఆ లక్ష్యాన్ని ఏడాదిపాటు వాయిదా వేసుకుంది ప్రభుత్వం. మళ్లీ పనులు వేగంగా సాగుతున్న క్రమంలో రెండో వేవ్‌ మళ్లీ దెబ్బ కొట్టింది. పనుల స్పీడ్‌ను తగ్గించింది.

Read Also….  Covid Vaccine: వ్యాక్సిన్‌తోనే కరోనాకు చెక్ అంటున్న నిపుణులు.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు.. ఎంతమందికి టీకా అందిందంటే..?