Telangana Corona Cases Update: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

Corona Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ..

Telangana Corona Cases Update: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
Corona Cases Telangana

Updated on: Mar 25, 2021 | 9:45 AM

Corona Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 493 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,04,791కి చేరింది.

ఇందులో 3684 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,99,427 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా నలుగురు మృతి చెందగా.. ఇప్పటిదాకా మొత్తం మరణించిన వారి సంఖ్య 1,680కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 157 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, కొత్తగా జీహెచ్ఎంసీలో 138 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 98,45,577 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Also Read:

కసితో వేటాడిన సింహం.. మెరుపు దాడి చేసిన అడవి దున్న.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!