AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Family Sucide: మంచిర్యాలలో విషాదం.. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య

Family Members Sucide: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

Family Sucide: మంచిర్యాలలో విషాదం.. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య
Family Sucide
Shaik Madar Saheb
|

Updated on: Mar 25, 2021 | 9:30 AM

Share

Family Members Sucide: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం మల్కపల్లిలో గురువారం జరిగింది. అప్పుల బాధలు భరించలేక కొడుకు, కూతురికి విషమిచ్చి దంపతులిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జంజిరాల రమేశ్‌ (40), పద్మ (35) దంపతులు ఓ గదిలో, కుమారుడు అక్షయ్‌ (17), కుమార్తె సౌమ్య (19), మరో గదిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవలే కుమార్తె అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. అయితే రమేష్.. కూతురు సౌమ్యకు ఏడాది క్రితమే హాజీపూర్ మండలం రాపెల్లికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ క్రమంలోనే అప్పులు బాధలు పెరగడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఘటనా స్థలంలో లేఖ లభ్యం.. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లో ఓ లేఖను గుర్తించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రమేష్ లేఖ రాశాడు. కొన్నాళ్ళుగా రమేష్ భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.. ఈ క్రమంలో అప్పులు పెరగడంతో ఇంటిల్లిపాది ఆత్మహత్యచేసకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ుల కాసిపేట పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read:

Follow Us
పార్టీ మార్పుపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఒకేసారి 2, 3 లోన్స్ తీసుకోవచ్చా..? ఆర్బీఐ రూల్స్..
ఒకేసారి 2, 3 లోన్స్ తీసుకోవచ్చా..? ఆర్బీఐ రూల్స్..
56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి
56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి
DC vs PBKS: క్యాచ్ పట్టబోయి మైదానంలో కుప్పకూలిన స్టార్ బౌలర్..
DC vs PBKS: క్యాచ్ పట్టబోయి మైదానంలో కుప్పకూలిన స్టార్ బౌలర్..
మీ గ్యాస్ స్టవ్‌లో ఎర్ర మంట వస్తోందా.?
మీ గ్యాస్ స్టవ్‌లో ఎర్ర మంట వస్తోందా.?
బీసీసీఐ ఛీకొట్టింది.. ఒకే ఓవర్‌లో 28 పరుగులతో ఇచ్చిపడేశాడుగా
బీసీసీఐ ఛీకొట్టింది.. ఒకే ఓవర్‌లో 28 పరుగులతో ఇచ్చిపడేశాడుగా
శ్మశానం బాత్‌రూమ్‌లో కనిపించిన నల్లటి కవర్.. ఏంటని ఓపెన్ చేయగా
శ్మశానం బాత్‌రూమ్‌లో కనిపించిన నల్లటి కవర్.. ఏంటని ఓపెన్ చేయగా
ఈ 5 చాణక్య సూత్రాలు తెలుసుకుంటే.. మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు!
ఈ 5 చాణక్య సూత్రాలు తెలుసుకుంటే.. మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు!
లవర్‌తో కలిసి ఫ్లాట్‌ తీసుకున్నాడు.. రెండు రోజులైనా శబ్దం లేదు..
లవర్‌తో కలిసి ఫ్లాట్‌ తీసుకున్నాడు.. రెండు రోజులైనా శబ్దం లేదు..
మీ పిల్లల చదవు, పెళ్లికి నో టెన్షన్.. కేంద్రం సూపర్ స్కీమ్..
మీ పిల్లల చదవు, పెళ్లికి నో టెన్షన్.. కేంద్రం సూపర్ స్కీమ్..