AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యుత్‌ వైర్లు తగిలి కంటైనర్‌ లారీలో చెలరేగిన మంటలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

విద్యుత్‌ వైర్లు తగిలి ఓ కంటైనర్‌ లారీ దగ్థమైంది. కరెంట్‌ షాక్‌ తగిలినప్పటికీ వెంటనే తేరుకున్న డ్రైవర్‌, క్లీనర్‌ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం (డిసెంబర్ 26) మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఎంహెచ్‌05 ఎఎం3432 అనే నంబర్‌ కలిగిన కంటైనర్‌ ఖాళీ లారీతో డ్రైవర్‌ ఎండీ ఖరీం, క్లీనర్‌ ఎండి రిద్వాన్‌లు..

Telangana: విద్యుత్‌ వైర్లు తగిలి కంటైనర్‌ లారీలో చెలరేగిన మంటలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Container Lorry Caught Fire
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2023 | 12:16 PM

బషీరాబాద్‌ , డిసెంబర్‌26: విద్యుత్‌ వైర్లు తగిలి ఓ కంటైనర్‌ లారీ దగ్థమైంది. కరెంట్‌ షాక్‌ తగిలినప్పటికీ వెంటనే తేరుకున్న డ్రైవర్‌, క్లీనర్‌ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం (డిసెంబర్ 26) మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఎంహెచ్‌05 ఎఎం3432 అనే నంబర్‌ కలిగిన కంటైనర్‌ ఖాళీ లారీతో డ్రైవర్‌ ఎండీ ఖరీం, క్లీనర్‌ ఎండి రిద్వాన్‌లు బయల్దేరారు. వీరు మేడ్చల్‌లోని ఓ కంపెనీ గోడోన్‌ నుంచి సామగ్రిని తీసుకొచ్చేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మేడ్చల్‌ కండ్లకోయం ఆర్‌వీఎం మాల్‌ సమీపంలో మేడ్చల్‌ నుంచి కొంపల్లి వైపునకు యూటర్న్‌ చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్‌ ఖరీం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మూలంగా ఒక్కసారిగా లారీ టర్న్‌ కాలేదు.

ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి లారీ దూసుకెళ్లింది. దీంతో విద్యుత్‌ స్తంభాలకు ఉన్న వైర్లు కంటైనర్‌ పైభాగానికి తగిలాయి. అయితే లారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌లకు స్వల్పంగా కరెంటు షాక్‌ తగిలింది. దీంతో వెంటనే తేరుకున్న వారిద్దరూ బయటకు దూకడంతో ప్రాణాలు కాపాడుకోగలిగారు. విద్యుత్‌ వైర్ల షాక్‌తో మంటలు చెలరేగి కంటైనర్‌ లారీ దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

డిసెంబర్‌ 28న అంపశయ్య నవీన్‌కు ’నేరెళ్ల స్మారక ప్రతిభా పురస్కారం’

ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌ మరో అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనకు ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు జయంతి సందర్భంగా నేరెళ్ల వేణుమాధవ్‌ స్మారక ప్రతిభా పురస్కారాన్ని ప్రకటించారు. తెలుగు సాహిత్యంలో 34 నవలలు, 8 కథా సంపుటాలు, 5 వ్యాస సంపుటాలు వెలువరించిన గొప్ప రచయిత నవీన్‌. ఓరుగల్లు సాహితీ కిరణం అంపశయ్యను గుర్తించి ప్రతిష్టాత్మకమైన ప్రతిభా పురస్కారాన్ని డిసెంబర్‌ 28న వేణుమాధవ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరగనున్న వేణుమాధవ్‌ జయంతి సందర్భంగా ప్రదానం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.