తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ భారీగా పరిహారం చెల్లించింది. ఏకంగా రూ.2 లక్షలు పరిహారం కింద రాష్ట్ర పోలీస్ బాస్ అందుకోనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ DGP రవి గుప్తా, ఆయన భార్య అంజలి గుప్తా కలిసి.. మే 23, 2023న హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు. వీళ్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్‌లో ట్రావెల్ చేయగా.. వాటిలోని రిక్లైనర్ సీట్లు ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ ద్వారా ఆటోమేటిక్‌గా వెనక్కి వాలుతుండటంతో.. ఇబ్బంది పడ్డారు. విషయాన్ని విమాన స్టాఫ్‌కు తెలియజేశారు.
హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లే సమయంలో ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడంతో.. అవి పని చేయలేదని DGP కపుల్ తెలుసుకున్నారు. ఈ ఇబ్బందితో డీజీపీ దంపతులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో తీవ్ర అసహనానికి లోనైన DGP రవి గుప్తా.. బిజినెస్ క్లాస్ కోసం ఒక్కో టికెట్‌కు రూ.66,750 చెల్లించామని.. అయినా ప్రయాణం మొత్తం మేల్కొని ఉండాల్సి వచ్చిందని తమ అసౌకర్యాన్ని వినియోగదారుల కమిషన్‌కు కంప్లైంట్ చేశారు. తాము పే చేసిన టికెట్ ధర.. ఎకానమీ క్లాస్ ధర రూ.18,000 కంటే రూ.48,750 ఎక్కువ అని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. అంతేగాక బిజినెస్ క్లాస్ కోసం డబ్బు చెల్లిస్తే.. తమను ఎకానమీ క్లాస్ పాసింజర్స్‌గా ట్రీట్ చేశారని, అదనపు లెగ్‌రూమ్ కూడా మినహాయించారంటూ ఫైరయ్యారు.
అంతేకాకుండా వసూలు చేసిన డబ్బు రీఫండ్ చేయకుండా రూ.10 వేల క్రిస్ ఫ్లైయర్స్ మైల్స్ ఆఫర్ అంటూ అనైతిక వ్యాపారానికి పాల్పడ్డారని కమిషన్‌కు వివరించారు. విచారించిన హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 తాజాగా తీర్పు వెలువరించింది. కంప్లైంట్ చేసినవారు చెల్లించిన టికెట్ల మనీ రూ.97,500.. 12 శాతం ఇంట్రస్ట్‌తో కలిపి చెల్లించడంతోపాటు.. ఇబ్బందికి గురి చేసినందుకు పరిహారంగా రూ.లక్ష, కేసు ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించింది. 45 రోజుల్లో ఆ మొత్తం డబ్బు రవిగుప్తా దంపతులకు చెల్లించాలని సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌కు చెందిన ముంబై, బెంగళూరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు, సింగపూర్ ఎయిర్‌లైన్స్ హౌస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..