Revanth Reddy : తెలంగాణలో కరోనా తగ్గించి చూపడం వల్లనే ఈ పరిస్థితులు : ఎంపీ రేవంత్ రెడ్డి

MP Revanth reddy : కేసీఆర్ ప్రభుత్వం కరోనా కేసులను తగ్గించి చూపడం వల్లే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు, మెడిసిన్లు తక్కువగా పంపుతోందని మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు...

Revanth Reddy : తెలంగాణలో కరోనా తగ్గించి చూపడం వల్లనే ఈ పరిస్థితులు : ఎంపీ రేవంత్ రెడ్డి
Revanth Reddy
Follow us

|

Updated on: May 13, 2021 | 8:39 PM

MP Revanth reddy : కేసీఆర్ ప్రభుత్వం కరోనా కేసులను తగ్గించి చూపడం వల్లే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు, మెడిసిన్లు తక్కువగా పంపుతోందని మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్ తెలంగాణలోనే తయారవుతోందని, తెలంగాణ అవసరం తీరిన తర్వాతే బయట రాష్ట్రాలకు ఇస్తామని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలు వారి అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను పంపిస్తున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులన్నీ కేసీఆర్ బంధువులవేనని, అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదంటూ రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ సలహాలను విని ప్రధాని మోదీ మెచ్చుకున్నారని ప్రభుత్వం తెలిపిందని, ఇంకా నయం… ఢిల్లీకి పిలిపించి సన్మానం చేస్తారని కేసీఆర్ చెప్పుకోలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రెండో విడత కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ సర్కార్ ఘోరంగా విఫలమైందన్న ఆయన, కరోనా వ్యాక్సిన్‌ను కేవలం రెండు కంపెనీలే తయారు చేస్తున్నాయని, మిగతా కంపెనీలకు కేంద్ర అనుమతే లేదని, అలాంటి సమయంలో గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎవరిని మభ్య పెట్టడం కోసం ఆ టెండర్లను పిలుస్తున్నారని ప్రశ్నించారు. వ్యాక్సిన్ తయారీ చేస్తున్న రెండు కంపెనీల సాంకేతిక నైపుణ్యాన్ని ఇతర కంపెనీలకు ఇప్పించాలని, అప్పుడే అందరికీ వ్యాక్సిన్ అనే కల నెరవేరుతుందని రేవంత్ సూచించారు. వ్యాక్సిన్ అంశాన్ని కూడా వ్యాపారాత్మక ధోరణిలో ఆలోచించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మందులు, వ్యాక్సిన్‌పై కూడా జీఎస్టీ వసూలు చేయడం దుర్మార్గమ్మన్న ఆయన, కరోనా వైద్యానికి ఉపయోగించే అన్నింటిపై జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Read also : Covaxin : కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీకి కేంద్రం నిర్ణయం, టీకా ఫార్ములా మరికొన్ని కంపెనీలకు.. వేగవంతం కానున్న ఉత్పత్తి

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?