Congress – Trs: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఏ విషయంలో అంటే..!

|

Dec 24, 2021 | 9:29 PM

Congress - Trs: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.

Congress - Trs: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఏ విషయంలో అంటే..!
Jaggareddy
Follow us on

Congress – Trs: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని 2.36 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల ప్రకటన తరువాత.. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. ఫలితాలను రివ్యూ చేయాలంటూ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనపై స్పందించిన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.

గత పది రోజుల నుండి విద్యార్థులు, తల్లితండ్రులో ఉన్న ఆందోళనను తొలిగించారని అన్నారు. మినిమమ్ మార్కులతో పాస్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరుపున, ఒక శాసభ్యుడిగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేలా పోరాడిన ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బాలమురి వెంకట్, ఆర్గనైజేషన్ కి అభినందనలు తెలిపారు. ఈ పోరాటంలో మీడియా పాత్ర కూడా కీలక అన్న ఆయన.. మీడియాకి కూడా అభినందనలు తెలిపారు. ప్రభుత్వం చెప్పినట్లు విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా చదువుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు.

Also read:

Viral Video: ఫేస్‌ ఎమ్మెల్యేది.. బాడీ స్టూడెంట్‌ది.. దుబ్బరేపారంతే.. వీడియో చూస్తే మీరూ షాక్ అవుతారు..

Evil Fish : అమ్మో.. ఆ చెరువులో దెయ్యం చేప.. ఆందోళనలో నిపుణులు.. ఎందుకంత భయమంటే..!

Lions Roaming: అర్థరాత్రి వేళ హల్‌ చల్ చేస్తున్న సింహాలు.. సీసీ విజువల్స్ చూసి హడలిపోతున్న జనాలు..