Case On Dog: ఓర్నీ.. కుక్కపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, పోలీసుల విచారణ..! ఎక్కడా..? ఎందుకు..?

|

Jun 06, 2022 | 4:06 PM

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ వ్యక్తి కుక్కపై కేసు పెట్టడానికి పోలీసులను ఆశ్రయించాడు. తన ఫిర్యాదును చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కుక్క కాటుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచిత్ర సంఘటన..

Case On Dog: ఓర్నీ.. కుక్కపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, పోలీసుల విచారణ..! ఎక్కడా..? ఎందుకు..?
Case On Dog
Follow us on

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ వ్యక్తి కుక్కపై కేసు పెట్టడానికి పోలీసులను ఆశ్రయించాడు. కుక్కలు కరుస్తున్నాయి.. యాజమానిపై కేసు పెట్టండి.. ఆ కుక్కల నుండి తమ ప్రాణాలకు భద్రత కల్పించండని ఓ వృద్ధుడు పోలీసులకు చేసిన ఫిర్యాదు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెంపుడు కుక్కలను యజమాని విచ్చలవిడిగా ఊరిలో వదలారు.. దీంతో ఆ కుక్కలు గ్రామస్తులను రక్కి గాయపరుస్తుండడంతో ఓ వృద్దుడు పోలీసులను ఆశ్రయించాడు.. పది రోజుల వ్యవధిలో మూడుసార్లు కుక్కకాటుకు గురయ్యానని తమ ప్రాణాలకు భద్రత కల్పించండని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసాడు.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన ధారవత్ పూల్య నాయక్ తనను ప్రతిసారి గూడూరు మండలంలో వ్యవసాయ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ కుక్క కరవడం జరుగుతుందనీ.. ఈ కుక్కను పెంచుకున్న వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని గూడూరు పోలీస్ లను ఆశ్రయించాడు. తన ఫిర్యాదును చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కుక్క కాటుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచిత్ర సంఘటనతో స్థానికులు సైతం విస్తూ పోయారు.పూర్తి వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ధారావత్ పూల్యా అనే వృద్దుడు పది రోజుల వ్యవధిలో మూడుసార్లు కుక్కకాటుకు గురయ్యాడు.. అవి వీధి కుక్కలైతే లైట్ తీసుకునే వారు..ఇదే గ్రామానికి చెందిన నూర్జహాన్ అనే యజమానికి చెందిన కుక్కలు.. పది రోజుల వ్యవధిలో మూడు సార్లు గాయపరిచాయి.. కుక్కలను లోపల కట్టేయాలని వేడుకున్నా వినలేదు… పైగా వృద్దుడి పైకీ కుక్క యజమాని సంబంధీకులు దాడికీ యత్నించారు. గ్రామస్తులు చెప్పినా కూడ ఆ పెంపుడు శునకాల యజమానిలో మార్పు రాలేదు.

ఇవి కూడా చదవండి

ఒకే మనిషి పై మూడుసార్లు పెంపుడు కుక్కలు దాడిచేసినా, యజమానిలో చలనం లేదు. ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో తీవ్ర మనస్తాపం చెందిన వృద్దుడు గూడూరు పోలీసులను ఆశ్రయించాడు. తనను గాయపర్చిన కుక్కలపై, ఆ శునకాల యజమానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు..ఆ శునకాల బారి నుండీ తనను, గ్రామస్తులను కాపాడాలనీ మొరపెట్టుకున్నా డు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన పోలీసులు కుక్కల యజమానిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పెంపుడు కుక్కలపై కేసు పెట్టడంతో ఈ ఫిర్యాదు స్థానికంగా తీవ్ర చర్చనీయంశంగా మారింది.