AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.. కొడంగల్‌లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయడం లేదని, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Revanth Reddy: కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
Cm Revanth Reddy
Prabhakar M
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 23, 2024 | 9:18 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.. కొడంగల్‌లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయడం లేదని, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్మికులు, యువత, మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడం తన ప్రభుత్వం దృష్టి, లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. భూసేకరణ పరిహారాన్ని పెంచడంపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తుందని హామీ ఇచ్చారు. సొంత నియోజకవర్గ ప్రజలకు తాను ఎలాంటి ఇబ్బంది కలగనివ్వనని.. కొడంగల్ అభివృద్ధి తన బాధ్యత అంటూ సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పరిశ్రమల వల్ల కాలుష్యం లేకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు ఉంటాయని ఆయన తెలిపారు.

వామపక్ష నాయకులతో సమావేశం

కాగా.. లగచర్ల ఘటనపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని వామపక్ష నేతల ప్రతినిధి బృందం శనివారం సీఎం రేవంత్ రెడ్డిన ికలిసింది. లగచర్ల ఘటనపై వినతిపత్రం అందజేసి, అమాయక రైతులపై ఉన్న కేసులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 21వ తేదీన లగచర్లలో పర్యటించామని.. అక్కడి పరిస్థితిని తెలుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కుట్ర చేసేవారిని వదిలిపెట్టమన్నారు. రైతుల సమస్యల్ని తీర్చడంపై దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే ముఖ్య లక్ష్యమని అభివృద్ధి కోసం ఎప్పుడూ ఆ కృషి చేస్తానని చెప్పారు.

ఈ ప్రకటనతో కొడంగల్‌లో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి పనులపై స్పష్టత వచ్చింది. అధికారిక ప్రకటనలతో భవిష్యత్తు దిశగా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..