Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక, ఎక్కడంటే..
హోటల్‌లో ఫుడ్ అనగానే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. నాణ్యత లేని ఆహారంతో ప్రజల ప్రాణాలను బలి చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా బిర్యానీలో బొద్దింక వచ్చిన సంఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉన్న ఓ రెస్టారంట్‌లో బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది..
బయటి ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న భయం పట్టుకుంది. హైదరాబాద్ అంటేనే బిర్యానీకి కేరాఫ్ అడ్రస్. ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ బిర్యానీకి కొందరు కేటుగాళ్లు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తమ కాసుల కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఏవరు ఏమై పోతే మాకేంటి.. మా జేబులు నిండితే చాలన్నట్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు.
నాణ్యత లేని ఆహార పదార్థాలను పెడుతూ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. బుజి పట్టిన చికెన్, కల్తీ ఆహార పదార్థాలు, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, చెత్తతో నిండిన టీ పౌడర్.. ఇలా నిత్యం వార్తల్లో ఏదో ఒక సంఘటన వస్తూనే ఉంది. అయితే తాజాగా బిర్యానీలో ఏకంగా బొద్దింక దర్శనమిచ్చింది.
హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగిన ఈ సంఘటన షాక్‌కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అల్వాల్‌లోని ఓ రెస్టరెంట్‌లో కస్టమర్లు బిర్యానీ ఆర్డర్ ఇచ్చి. తినేందుకు సిద్ధమయ్యారు. బిర్యానీ తింటున్న సమయంలో బొద్దింకలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే అలాంటిదేం లేదని బుకాయించారు.
దీంతో ఆగ్రహంతో కస్టమర్లు కిచెన్‌లో ఉన్న ఫ్రిజ్‌ను పరిశీలించారు. అందులో బుజూ పట్టిన గోంగూర పచ్చడి, చికెన్ లెగ్ పీస్‌లను గుర్తించారు. బిర్యానీ తిన్న వెంటనే కస్టమర్లకు ఫుడ్ ఫాయిజన్ అయ్యింది, వాంతులు చేసుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి హోటల్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మొన్నటికి మొన్న అల్వాల్ సమీపంలోని లోతుకుంటలో షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలతో ప్రజలు బయట ఫుడ్ అంటేనే దడుసుకునే పరిస్థితి వచ్చింది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..