Hyderabad: హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌ ప్యాకేజీ మీకోసం..

హైదరాబాద్‌ ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు పెట్టింది పేరు. ఇక్కడి నిర్మాణాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంటాయి. అప్పటి నిజాం రాజుల విలాసాలకు సాక్ష్యంగా నిలిచే ఫలక్‌నుమా ప్యాలెస్‌, చౌహముల్లా ప్యాలెస్‌లను ఒక్కసారైనా చూడాలని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ఒక ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది...

Hyderabad: హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌ ప్యాకేజీ మీకోసం..
Nizam Palace Tour
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 24, 2024 | 9:42 AM

హైదరాబాద్‌ అంటే మొదటగా గుర్తొచ్చేది అక్కడి చారిత్రాత్మక కట్టడాలు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న భాగ్య నగరంలో ఎన్నో అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. అప్పటి నిజాం రాజులు నిర్మించిన భవనాలు కొన్ని శిధిలావస్థకు చేరుకోగా మరికొన్ని మాత్రం ఇప్పటికే చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. సహజంగా హైదరాబాద్‌లో పురాతన నిర్మాణాలు అనగానే మనకు చార్మినార్‌, గోల్కోండ, మక్కా మసీద్‌ లాంటి నిర్మాణాలే గుర్తొస్తాయి. కానీ అద్బుతమైన ప్యాలెస్‌లు కూడా ఉన్నాయి.

అలనాటి నిర్మాణశైలి ఉట్టిపడేలా కనిపించే అద్భుతమైన ప్యాలెస్‌లు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి చౌహముల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లు ప్రధానమైనవి. వీటిని సందర్శించేందుకు వీలుగా తెలంగాణ టూరిజం పర్యాటకుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజామ్‌ ప్యాలేజ్‌ టూర్‌ పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. కేవలం ఒక్కరోజులోనే ఈ టూర్‌ను ముగించవచ్చు. ఇందులో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతీ రోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఈ టూర్‌ ఉంటుంది. బేగంపేట్‌లోని టూరిజం ప్లాజా నుంచి బస్సు బయలుదేరుతుంది. 12.15 గంటలకు తాజ్‌ కృష్ణకు చేరుకుంటుంది. ఆ తర్వాత 12.45 గంటలకు ట్యాంక్‌ బండ్‌కు చేరుకుంటారు. ఇక ముందుగా చౌహమల్లా ప్యాలెస్‌ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ఫలక్ నుమా ప్యాలెస్‌ను సందర్శిస్తారు. తిరిగి రాత్రి 7.30 గటలకు టూరిజం ప్లాజా వద్ద డ్రాప్‌ చేస్తారు.

టూర్‌ ప్యాకేజీ ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 2400గా చిన్నారులకు రూ. 1920గా నిర్ణయించారు. ఏసీ బస్సు కావాలనుకుంటే ఛార్జీలు వేరుగా ఉంటాయి. భోజనానికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. టూర్‌ ప్యాకేజీని బుక్‌ చేసుకునే ముందు తెలంగాణ టూరిజంకు చెందిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించండి. పూర్తి వివరాలు, టూర్‌ బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి