AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: టీఎస్‌పీఎస్సీ, ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపరమైన అంశాల్లో దూకుడు పెంచారు. అనేక శాఖలకు సంబంధించి రివ్యూలు నిర్వహిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదట వ్యవసాయం, రైతు భరోసా అంశాలపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు.

CM Revanth Reddy: టీఎస్‌పీఎస్సీ, ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Dec 11, 2023 | 9:30 PM

Share

సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపరమైన అంశాల్లో దూకుడు పెంచారు. అనేక శాఖలకు సంబంధించి రివ్యూలు నిర్వహిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదట వ్యవసాయం, రైతు భరోసా అంశాలపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై రివ్యూ చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్లపై ఆరా తీశారు. పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

డ్రగ్స్ నియంత్రణపై అధికారులతో చర్చ

ఆ తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ మీద అధికారులతో చర్చించారు సీఎం రేవంత్‌. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోందంటూ ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంతో.. వీటిని పూర్తిస్థాయిలో నియంత్రించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర నీటి పారుదలశాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా అధికారులతో రివ్యూ చేశారు. తెలంగాణలో నీటిపారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉందని.. ప్రజల డబ్బులతో ప్రాజెక్టులను కడుతున్నామని అన్నారు. అత్యంత పారదర్శకంగా పనులు ఉండాలని.. అపోహలు తొలగిపోయేలా పని చేయాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని తెలిపారు.

వ్యవసాయశాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రైతుల సంక్షేమానికి అధికారులు పని చేయాలని.. మంచి పద్ధతులు, టెక్నాలజీ సాయంతో అధిక దిగుబడి ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం కృషి చేయాలని అన్నారు. వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా