Revanth Reddy: ఏపీలో అధికారంలోకి టీడీపీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఏమంటే..?

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. వంద రోజుల పాలన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇది ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకమే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Revanth Reddy: ఏపీలో అధికారంలోకి టీడీపీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఏమంటే..?
Cm Revanth Reddy

Updated on: Jun 05, 2024 | 3:53 PM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. వంద రోజుల పాలన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇది ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకమే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనకు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లు వచ్చాయని.. వాటి కన్నా లోక్‌సభ ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ పార్టీకి 41శాతం ఓట్లు వచ్చాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని విమర్శించారు. ప్రధాని మోదీ గ్యారంటీకి వారంటీ ముగిసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని పదవికి మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో గెలుపోటములన్నింటికీ తానే బాధ్యుడినని సీఎం రేవంత్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలా స్వీకరిస్తున్నాని చెప్పారు. ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా…సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. జాతీయ స్థాయిలో తెలంగాణలో వచ్చిన ఫలితాలపై అందుబాటులో ఉన్న వాళ్లతో సమీక్ష చేసుకున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చాయన్నారు. రాహుల్ పాదయాత్ర దేశ వ్యాప్తంగా ప్రభావం చూపిందన్నారు. ఇండియా కూటమి ఏర్పాటు చేసి దేశవ్యాప్త మద్దతు కూడగట్టామని వివరించారు.

2019లో 4 సీట్లు గెలిచిన బీజేపీ.. ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిలో బీజేపీని గెలిపించడం కోసం బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని.. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందన్నారు. దీని కోసం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పని చేసిందన్నారు. 2001 నుండి ఇప్పటి వరకు సిద్దిపేట మెజారిటీ తగ్గలేదు.. కానీ ఈ ఎన్నికల్లో హరీష్ రావు ఆ ఓట్లను బీజేపీకి ట్రాన్స్‌ఫర్ చేశారన్నారు. కేవలం 2 వేల ఓట్లు మాత్రమే అక్కడ మెజారిటీ వచ్చిందని.. సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే మెదక్ సీటు ఓడిపోయామని రేవంత్ రెడ్డి తెలిపారు.

డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు..

డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం లోపల, అన్ని కార్యాలయాలలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. అదేరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుందని.. ఉత్సవాలకు సోనియాగాంధీని పిలవాలనుకుంటున్నామని చెప్పారు. సచివాలయంలో విగ్రహం ఏర్పాటు చేస్తామని.. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..