Revanth Reddy: అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. అందుకేనా..?

సీఎం రేవంత్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన శాసనసభ్యులతో భేటీ అయ్యారు. బాన్సువాడ ఎమ్మల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్‌లో ఉంటే ఫ్యూచర్‌ బ్రైట్‌గా ఉంటుందని వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Revanth Reddy: అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. అందుకేనా..?
Telangana Congress
Follow us

|

Updated on: Aug 01, 2024 | 8:04 AM

పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఈ డిన్నర్‌ మీట్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ దీపాదాస్ మున్షి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇటీవల గద్వాల ఎమ్మల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ మారడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన ఈ మీటింగ్‌కు అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కడియం. శ్రీహరి, కాలే యాదయ్య, డాక్టర్. సంజయ్, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌తో సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లోనే కొనసాగితే మంచి భవిష్యత్‌ ఉంటుందని, అందరికీ ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

కృష్ణమోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లే వచ్చి.. తిరిగి గులాబీ జెండా ఎత్తుకోవడంతో అంతా షాక్‌ అయ్యారు. స్థానిక నేతలతో పడకపోవడంతోనే తిరిగి బీఆర్‌ఎస్‌ వైపు వెళ్లారు కృష్ణమోహన్‌రెడ్డి. పాత పరిచయాలతో తెల్లం వెంకట్రావును బీఆర్‌ఎస్‌ఎల్పీలోకి తీసుకెళ్లారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు భుజం మీద చేయివేసి మాట్లాడిన సమయం ఫొటో లీక్‌ అవడంతో.. పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డిన్నర్‌ భేటీకి తెల్లం వెంకట్రావు కూడా హాజరయ్యారు.

వీడియో చూడండి..

భేటీ ముగిసిన అనంతరం టీవీ9తో మాట్లాడిన భద్రాచలం ఎమ్మల్యే.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇక బీఆర్‌ఎస్‌ వైపు మళ్లిన కృష్ణమోహన్‌రెడ్డి త్వరలోనే కేసీఆర్‌ను కలవనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ..
అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ..
ఓటీటీలోకి కల్కి వచ్చేది అప్పుడేనా.? వైరల్‌ అవుతోన్న అప్‌డేట్‌
ఓటీటీలోకి కల్కి వచ్చేది అప్పుడేనా.? వైరల్‌ అవుతోన్న అప్‌డేట్‌
రాజ్‌తరుణ్ ఎక్కడున్నా రావాలి.. ఇంటికెళ్లి రచ్చ చేసిన లావణ్య..
రాజ్‌తరుణ్ ఎక్కడున్నా రావాలి.. ఇంటికెళ్లి రచ్చ చేసిన లావణ్య..
భర్త అంటే ఎంత ప్రేమో.. భర్త నాటిన చెట్టుకు దుస్తులు తొడిగి జయంతి
భర్త అంటే ఎంత ప్రేమో.. భర్త నాటిన చెట్టుకు దుస్తులు తొడిగి జయంతి
దేశంలో నిలిచిపోయిన పలు బ్యాంకుల యూపీఐ సేవలు, అసలు కారణం ఏంటంటే..
దేశంలో నిలిచిపోయిన పలు బ్యాంకుల యూపీఐ సేవలు, అసలు కారణం ఏంటంటే..
హైదరాబాద్‌లో మరో నగరం.. నాలుగు వేల ఎకరాల్లో నిర్మాణం, ఎక్కడంటే
హైదరాబాద్‌లో మరో నగరం.. నాలుగు వేల ఎకరాల్లో నిర్మాణం, ఎక్కడంటే
కొండచరియలపై సునామీ లాంటి హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేమా?
కొండచరియలపై సునామీ లాంటి హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేమా?
బంగారం, వెండి కొనే వారికి అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే
బంగారం, వెండి కొనే వారికి అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే
వయనాడ్లో వర్షాలు, వరదలు తగ్గుముఖం.. సహాయక చర్యలు ముమ్మరం...
వయనాడ్లో వర్షాలు, వరదలు తగ్గుముఖం.. సహాయక చర్యలు ముమ్మరం...
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..