తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం హైదరాబాద్ నగర శివార్లలలో రేడి అవుతోంది. దీన్ని అత్యంత గోప్యంగా డిజైన్ చేపిస్తోంది..పెద్ద అంబర్ పేట గండి చేరువు దగ్గరలోని ఓ శిల్పి దీన్ని తయారు చేస్తున్నారు.. తెలంగాణ సచివాలయం ముందు దీని కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. డిసెంబర్ 9 న ఆవిష్కరించడానికి రేడి అవుతున్నారు.. దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం…ఈ ఏడాది ఫిబ్రవరి 4న కేబిటనేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం చేసిన ప్రకటన. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తెలంగాణ పల్లే తనం ఉట్టిపడేలా విగ్రహం-
ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కొత్తగా రూపొందిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహంపై స్పెషల్ గా ఫోకస్ చేస్తుంది సర్కార్.. దీని కోసం స్వయంగా శిల్పులతో రేవంత్ సమావేశాలు నిర్వహించారు. దాని తర్వాత డిజైన్ ను ఫైనల్ చేశారు.. సగటు తెలంగాణ మహిళ రూపంలో తెలంగాణ తల్లి ఉండనున్నట్లుగా విగ్రహనికి సంబంధించి అన్ని భాధ్యతలు చూస్తున్న ఓ మంత్రి టివి9 తెలుగు తో వివరాలు వెల్లడించారు. తెలంగాణ వ్యవసాయం, బతుకమ్మ, శ్రమ జీవనం, పోరాటం, ఇలా అన్ని సందేశాలు ఇచ్చే విధంగా తెలంగాణ తల్లి విగ్రహన్ని రూపోందిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ఇప్పటికే సీఎం రెండు మూడు సార్లు ఏవరికీ చేప్పకుండా విగ్రహం తయారు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు.
విదేశాల్లో మాదిరి పౌంటైన్ –
ఇక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయబోయే ప్రదేశంలో పెద్ద ఫౌంటైన్‌ను, రాత్రికాగానే లేజర్ ఫౌంటైన్ ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని ట్యాంక్ బండ్ పైకి, ఏన్టీఆర్ మార్గ్ లోకి వచ్చే సందర్శకులకు సైతం అనుమతి ఇవ్వనున్నారు.. ఇప్పుడు పెట్టబోయే విగ్రహం కోసం సాదరణ సందర్శకుల కోసం ప్రత్యేక గేటును కూడ ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ప్రస్తుతం సర్కార్ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది.. డిసెంబర్ 9వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి..డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా.. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సోనియా గాంధీ జన్మదినంతో పాటు ప్రజా పాలన ఏడాది విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేసింది.