CM Revanth Reddy: బీఆర్ఎస్‌కు డిపాజిట్లు రావు.. ఇక పరిపాలనపైనే మా దృష్టంతా: సీఎం రేవంత్ రెడ్డి

|

May 14, 2024 | 7:34 PM

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం (మే 14) మీడియాతో ఛిట్ చాట్ నిర్వహించిన ఆయన లోక్ సభ ఎన్నికల ఫలితాలు, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: బీఆర్ఎస్‌కు డిపాజిట్లు రావు.. ఇక పరిపాలనపైనే మా దృష్టంతా: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy
Follow us on

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం (మే 14) మీడియాతో ఛిట్ చాట్ నిర్వహించిన ఆయన లోక్ సభ ఎన్నికల ఫలితాలు, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ”అసెంబ్లీ ఎన్నికల్లో మాకు పోటీ బీఆర్ఎస్‌ నే. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే మాకు పోటీ. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మ హత్యలే. బీఆర్ఎస్ అదే చేస్తోంది. నా పరంగా ఎన్నికలు ముగిసాయి. రేపటి నుండి పరిపాలనపై దృష్టి పెడతాను. తడిసిన బియ్యం, ఇచ్చిన హామీలపైనా పూర్తి స్థాయి సమీక్షా చేస్తాం. అన్ని విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి. సన్న బియ్యం ఇస్తాం అని చెప్పాం. వాటి పైన దృష్టి పెడతాం. అలాగే రైతు రుణ మాఫీ అంశంపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటాం. రాష్టంలో రాజకీయం అయిపోయింది. లోక్ సభ ఎన్నికల్లో మేం 13 సీట్లు గెలుస్తున్నాం.ఇక ధరణి పైన త్వరలో రిపోర్ట్ రానుంది. దీనిపై అసెంబ్లీ లో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం. ఏ విషయమైనా చర్చలు చేసి నిర్ణయం తీసుకుంటాం. కొన్ని విషయాల్లో అఖిలపక్షం సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తాం” అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…