CM Revanth Reddy: ఇక నుంచి తండాలో కూడా ప్రభుత్వ పాఠశాల.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. 'రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే అని సూచించారు. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దన్నారు.

CM Revanth Reddy: ఇక నుంచి తండాలో కూడా ప్రభుత్వ పాఠశాల.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..
CM Revanth Reddy
Follow us

| Edited By: Srikar T

Updated on: Dec 30, 2023 | 10:42 PM

తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. ‘రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే అని సూచించారు. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దన్నారు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలని ఆదేశించారు. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలను తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ నిర్వహించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం రేవంత్ చెప్పారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటుచేయడానికి ఉన్న మార్గాల అన్వేషించాలన్నారు.

ఉమ్మడి జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ..

రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేడు నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రో.లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా శాఖ దేవసేన, సి.ఎం.ఓ అధికారులు శేషాద్రి, షా-నవాజ్ కాసీం తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యాన్ని అందించేలా యూనివర్సిటీలుండాలన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘ కాల కోర్సులను ప్రవేశ పెట్టాలని పేర్కొన్నారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న ఈ విధమైన స్కిల్ యూనివర్సిటీలని అధ్యయనం చేయాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిలాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకుగాను, విద్యా శాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగు ప్రతిపాదనలను సమర్పించాలని సీఎస్ ను ఆదేశించారు. ఈ సందర్బంగా బాసరలోని రాజీవ్ గాంధీ నాలెడ్జి, టెక్నాలజీ యూనివర్సిటీ విద్యార్థినీ, విద్యార్థులకు ముఖ్యమంత్రి ఉచితంగా లాప్-టాప్ లు పంపిణీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పీవీఆర్‌ ఐనాక్స్‌, ఖుషీ అడ్వర్టైజింగ్‌తో కీలక ఒప్పందం..
పీవీఆర్‌ ఐనాక్స్‌, ఖుషీ అడ్వర్టైజింగ్‌తో కీలక ఒప్పందం..
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు..
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు..
దసరాకు ముందు పేదలకు గుడ్‌న్యూస్.. కేంద్రం మరో కీలక ప్రకటన
దసరాకు ముందు పేదలకు గుడ్‌న్యూస్.. కేంద్రం మరో కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌పై ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి ప్రశంసలు..
పవన్‌ కల్యాణ్‌పై ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి ప్రశంసలు..
బీపీని కంట్రోల్ చేసే బెస్ట్ డ్రింక్స్ ఇవే.. డోంట్ మిస్!
బీపీని కంట్రోల్ చేసే బెస్ట్ డ్రింక్స్ ఇవే.. డోంట్ మిస్!
రిచ్ లుక్‌లో మేడ్ ఇండియా ఈ-స్కూటర్.. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ
రిచ్ లుక్‌లో మేడ్ ఇండియా ఈ-స్కూటర్.. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ
బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పులు లేకుండా కిచ్చా సుదీప్..
బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పులు లేకుండా కిచ్చా సుదీప్..
జీవితంలో ఒక మనిషిని ఇలా ఎవరైనా ప్రేమించగలరా..? సాయి పల్లవి
జీవితంలో ఒక మనిషిని ఇలా ఎవరైనా ప్రేమించగలరా..? సాయి పల్లవి
రెండోసారి తండ్రి కాబోతోన్న రోహిత్ శర్మ.. కివీస్ సిరీస్ నుంచి ఔట్?
రెండోసారి తండ్రి కాబోతోన్న రోహిత్ శర్మ.. కివీస్ సిరీస్ నుంచి ఔట్?
కీళ్ల నొప్పులను పెంచే ఫుడ్స్ ఇవే.. వీటి జోలికి పోకండి..
కీళ్ల నొప్పులను పెంచే ఫుడ్స్ ఇవే.. వీటి జోలికి పోకండి..