సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చేరిక..
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమె సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమెను వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం సాయంత్రం శోభ ఆసుపత్రిలో చేరగా.. ఆమెకు వైద్యులు మోకాలిచిప్ప ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతుండగా.. సీఎం కేసీఆర్ ఆమెను చూసేందుకు వెళ్లారు. తన భార్య ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్.. డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఇదిలా ఉంటే కేసీఆర్‌తో వెళ్ళిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. సీఎం సతీమణి శోభను పరామర్శించారు. అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్ చేరుకున్నారు.