CM KCR: నేడు నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్ పర్యటన.. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన

|

Feb 21, 2022 | 9:58 AM

CM KCR visit Narayankhed today: కరువుతో అల్లాడుతున్న ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సమయం ఆసన్నమైంది. సీఎం కేసీఆర్‌ ఈ రోజు ఆ బృహత్తర పథకానికి

CM KCR: నేడు నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్ పర్యటన.. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
Cm Kcr
Follow us on

CM KCR visit Narayankhed today: కరువుతో అల్లాడుతున్న ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సమయం ఆసన్నమైంది. సీఎం కేసీఆర్‌ ఈ రోజు ఆ బృహత్తర పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. భగీరథ ప్రయత్నంతో ఆ ప్రాంతంలో నెలకొన్న కరువును పారదోలాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంకల్పించారు. 4 వేల 467 కోట్ల రూపాయల వ్యయంతో.. సంగారెడ్డి జిల్లాలో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ( Sangameshwara and Basaveshwara) ఎత్తి పోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అందుకు నారాయణఖేడ్ వేదిక కానుంది. కరువుతో అల్లాడుతున్న నారాయణఖేడ్ ప్రాంతానికి, గోదావరి నీళ్లు తీసుకొస్తానని గతంలో కేసీఆర్ హామీఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సంగమేశ్వర- బసవేశ్వర ఎత్తి పోతల (lift irrigation projects) పథకానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్‌లోని మూడు లక్షలకుపైగా ఎకరాలకు సాగు , తాగు నీరు అందనుంది. కేసీఆర్‌ టూర్‌ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. స్థానిక అనురాధ డిగ్రీ కళాశాల ఆవరణలో సభ ఏర్పాట్లు చేశారు. సీఎం సభ జరిగే స్థలాన్ని పరిశీలించారు మంత్రి హరీశ్‌రావు. సభ విజయవంతం అయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నారు గులాబీ నేతలు. జనాల్ని భారీగా తరలించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నారాయణ్ ఖేడ్‌కు మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. పథకాలకు శంకుస్థాపన అనంతరం.. సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

కాగా.. నిన్న సీఎం కేసీఆర్ ముంబైలో పర్యటించారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సమావేశమయ్యారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఒక సమావేశం కూడా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ మీడియాతో పేర్కొన్నారు.

Also Read:

CM KCR: బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.. ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలిః కేసీఆర్

Garlic: వెల్లుల్లి తినడంతో ఆ వ్యాధి అదుపులో ఉంటుంది.. వెల్లడించిన అధ్యయనాలు..

Multibagger Stock: రూ. లక్షను.. రూ. 65 లక్షలు చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్.. బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ఎంత ఇచ్చాయంటే..