సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా డబుల్ బెడ్‌ రూమ్స్‌ పంపిణీ.. అధునాతన సౌకర్యాలతో కూడిన టౌన్‌షిప్‌

తెలంగాణ ముఖ్యమంత్రి గురువారం డబుల్ బెడ్‌ రూమ్స్‌ పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు నియోజకవర్గంలోని ఆర్సీపురం మండలం కొల్లూరులో రెండో దశలో భాగంగా నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. డిగ్నిటీ హౌసింగ్ టౌన్‌షిప్‌లో బాగంగా 15,660 ఫ్లాట్స్‌ను నిర్మించారు. గురువారం ఉదయం 11 గంటలకు..

సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా డబుల్ బెడ్‌ రూమ్స్‌ పంపిణీ.. అధునాతన సౌకర్యాలతో కూడిన టౌన్‌షిప్‌
CM KCR

Updated on: Jun 21, 2023 | 5:24 PM

తెలంగాణ ముఖ్యమంత్రి గురువారం డబుల్ బెడ్‌ రూమ్స్‌ పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు నియోజకవర్గంలోని ఆర్సీపురం మండలం కొల్లూరులో రెండో దశలో భాగంగా నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. డిగ్నిటీ హౌసింగ్ టౌన్‌షిప్‌లో బాగంగా 15,660 ఫ్లాట్స్‌ను నిర్మించారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్న అతిపెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం.

కార్పొరేట్‌ స్థాయి అపార్ట్‌మెంట్‌ స్థాయిలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 1474.75 కోట్లు ఖర్చు చేసింది. 117 బ్లాక్స్‌లో  గృహాల నిర్మాణాలు  చేపట్టారు. అవసరాన్ని బట్టి ప్రతి బ్లాక్ రెండు లేదా మూడు స్టేయిర్ కేస్ ను ఏర్పాటు చేశారు. స్టిల్ట్ పార్కింగ్ తో పాటు పెవ్ బ్లాక్, వాచ్ మెన్ గది ఏర్పాటు చేశారు. ప్రమాదాల నియంత్రణకు ఫైర్  ఫిటింగ్, 8 మంది కెపాసిటీ గల ప్రతి బ్లాక్ కు  రెండు చొప్పున 234 లిఫ్ట్ లను  ఏర్పాటు చేశారు. లిఫ్ట్ , గృహాలకు నిరంతర విద్యుత్ కోసం పవర్ బ్యాక్ అప్ కోసం ప్రత్యేక జనరేటర్  ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ టౌన్‌షిప్‌లో నివసించే వారి కోసం అనేక సదుపాయాలను అందించారు. 6 నుండి 36 మీటర్ల  వెడల్పు గల 13.50 కిలోమీటర్ల రోడ్డు, భవిష్యత్తులో రోడ్డు కటింగ్ లేకుండా నాలా ఏర్పాటు. 21 వేల  కే.ఎల్ సామర్థ్యం గల వాటర్  స్టోరేజ్ అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్ కేబుల్‌ను ఏర్పాటు చేశారు. అలాగే నిరంతరాయ విద్యుత్ కోసం 30 కేవిఎ నుంచి  400 కె.వి.ఎ వరకు 133 జనరేటర్ ఏర్పాటు చేశారు. మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్‌ చేసి గార్డెనింగ్‌ పనులకు ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. వర్షపు నీటిని వృథా కానివ్వకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..