CM KCR Speech highlights: ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయం.. సూర్యపేట సభలో సీఎం కేసీఆర్‌

ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. సీఎం ఇంకా మాట్లాడుతూ..

CM KCR Speech highlights: ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయం.. సూర్యపేట సభలో సీఎం కేసీఆర్‌
CM KCR Speech

Edited By:

Updated on: Aug 20, 2023 | 6:24 PM

CM KCR Speech highlights: ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

సీఎం ఇంకా మాట్లాడుతూ.. ‘సూర్యపేటకు వచ్చే ముందు మంత్రి జగదీష్‌ ఏం అడగను అన్నారు. జిల్లా ఇచ్చారు, మాకు ఇంకేం వద్దన్నారు. ఇప్పుడేమో సూర్యపేటకు రాగానే అన్ని అడుగుతున్నారు. ప్రజలకు సేవచేసే ఎమ్మెల్యేలు ఇలాగే ఉంటారు’ అని చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన కేసీఆర్‌.. ‘కాంగ్రెస్‌ కానీ బీజేపీ కానీ ఎన్నడైనా నల్లగొండలో, సూర్యాపేటలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఆలోచన ఎందుకు చేయలేదు.? రైతులు చనిపోతుంటే, కనీస మద్ధతు ధర ఇచ్చారా.? కళ్యాణ లక్ష్మీణి, పెన్షన్‌ను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతున్నాం.  50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పెన్షన్‌ పెంచే ఆలోచన ఎప్పుడైనా చేసిందా.?ఇప్పడు రూ. 4 వేలు ఇస్తామంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ. 4 వేలు ఇస్తున్నారా.? కాంగ్రెస్‌ను నమ్మితే ఉన్నది పోతది, ఉంచుకున్నది పోతది’ అని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.

ఇంకా జరగాల్సింది ఉంది..

తెలంగాణలో ఇంకా జరగాల్సిన పనులు ఉన్నాయన్న కేసీఆర్‌.. ‘హైదరాబాద్‌ విశ్వనరంగా మారుతోంది, పరిశ్రమలు వస్తున్నాయి, ఈ అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలవాలి అన్నారు. సూర్యాపేటలో నాలుగు ఎమ్మెల్యేలు గెలవడం ఖాయం. మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవడం ఖాయం. ఎవరెన్ని చెప్పినా, ఇంకా సీట్లు పెరుగుతాయి తప్ప తగ్గవు’ అని చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్ లైవ్ వీడియో..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Aug 2023 05:57 PM (IST)

    ఇంకా జరగాల్సింది ఉంది..

    సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ విశ్వనరంగా మారుతోంది, పరిశ్రమలు వస్తున్నాయి, ఈ అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలవాలి అన్నారు. సూర్యాపేటలో నాలుగు ఎమ్మెల్యేలు గెలవడం ఖాయం. మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవడం ఖాయం. ఎవరెన్ని చెప్పినా, ఇంకా సీట్లు పెరుగుతాయి తప్ప తగ్గవు’ అని చెప్పుకొచ్చారు.

  • 20 Aug 2023 05:44 PM (IST)

    వాళ్లు ఎందుకు ఓటు వేయాలి..

    బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ కానీ బీజేపీ కానీ ఎన్నడైనా నల్లగొండలో, సూర్యాపేటలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఆలోచన ఎందుకు చేయలేదు.? రైతులు చనిపోతుంటే, కనీస మద్ధతు ధర ఇచ్చారా.? కళ్యాణ లక్ష్మీణి, పెన్షన్‌ను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతున్నాం. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పెన్షన్‌ పెంచే ఆలోచన ఎప్పుడైనా చేసిందా.?ఇప్పడు రూ. 4 వేలు ఇస్తామంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ. 4 వేలు ఇస్తున్నారా.? కాంగ్రెస్‌ను నమ్మితే ఉన్నది పోతది, ఉంచుకున్నది పోతది’ అని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.


  • 20 Aug 2023 05:36 PM (IST)

    ఏం అడగా అన్నారు, ఇప్పుడేమో..

    సూర్యపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. సూర్యపేటకు వచ్చే ముందు సూర్యపేట జిల్లా ఇచ్చారు, మాకు ఇంకేం వద్దు, ఏం అడగా అన్నారు. ఇప్పుడేమో సూర్యపేటకు రాగానే అన్ని అడుగుతున్నాడు అని చెప్పుకొచ్చారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షలు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

  • 20 Aug 2023 05:29 PM (IST)

    సూర్యపేటను సుందరంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే

    బహిరంగ సభలో మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యపేట సుందరంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. పట్టణంలో రెండు ట్యాంక్‌బండ్‌లను ఏర్పాటు చేశామన్నారు. పార్కులు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. సూర్యపేటను జిల్లా చేసిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మంచినీళ్లు ఇచ్చిన కాపాడాని సీఎంకు ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత అందరి ఉందని జగదీష్‌ చెప్పుకొచ్చారు.

  • 20 Aug 2023 05:02 PM (IST)

    సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర..

    సూర్యపేటలో నిర్మించిన పలు భవనాలను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సూర్యాపేట… జిల్లా కావడమే ఒక చరిత్ర. అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉంది. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. తలసరి ఆదాయంలో తెలంగాణనే నెంబర్‌వన్‌. జీరో ఫ్లోరోసిస్‌ స్టేట్‌గా తెలంగాణ నిలిచింది. విద్యుత్‌ వినియోగంలో మనమే టాప్‌.జిల్లాకో మెడికల్‌ కాలేజీ… ఏ రాష్ట్రంలోనూ లేదు’ అని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.

  • 20 Aug 2023 04:28 PM (IST)

    కాసేపట్లో ప్రారంభం కానున్న బహిరంగ సభ..

    ప్రస్తుతం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న సీఎం కేసీఆర్‌ మరికాసేపట్లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసగించనున్నారు.

  • 20 Aug 2023 03:27 PM (IST)

    అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం..

    సూర్యపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతోన్న తరుణంలో సీఎం ఏం మాట్లాడనున్నారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

  • 20 Aug 2023 02:52 PM (IST)

    సూర్యపేట చేరుకున్న సీఎం కేసీఆర్..

    పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ సూర్యపేట చేరుకున్నారు. పర్యటనలో భాగంగా నూతన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్‌, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాలు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.