మరికాసేపట్లో నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం.. హాలియా ధన్యవాద సభకు భారీగా ఏర్పాట్లు

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్‌ చివరి భూములతో పాటు ఎగువన ఉన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు.

మరికాసేపట్లో నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం.. హాలియా ధన్యవాద సభకు భారీగా ఏర్పాట్లు
Balaraju Goud

|

Feb 10, 2021 | 8:35 AM

CM KCR tour arrangements : నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్‌ చివరి భూములతో పాటు ఎగువన ఉన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల రూ.3వేల కోట్ల నిధులు మంజూరు చేస్తూ సీఎం ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ద్వారా జిల్లాలో 55వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందనుంది. దీంతో ఆయా సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ లకు నేడు ముఖ్యమంత్రి సాగర్ లోని నెల్లికల్ వద్ద శంఖుస్ధాపన చేయనున్నారు

నల్లగొండ జిల్లా ప్రజలకు ఈపథకాలు అందించినందుకు కృతజ్ఞతగా హాలియాలో భారీ ధన్యవాద సభ ఏర్పాటు చేశారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో ఉదయం 11.40కి బయలుదేరి మధ్యాహ్నం 12.30కి హాలియాకు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో సాగర్‌ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల పరిధిలోని నెల్లికల్లు గ్రామంలో ఎత్తిపోతల పథకంతోపాటు ఉమ్మడి జిల్లాకు మంజూరైన మరో ఎనిమిది ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత నాగుర్జునసాగర్ లోని హిల్‌కాలనీలోని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో భోజనం అనంతరం మద్యాహ్నం మూడున్నర గంటలకు హాలియా వద్ద ఏర్పాటు చేసిన ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

అనంతరం తిరిగి హెలికాఫ్టర్ ద్వారా 5గంటలకు బేగంపేట చేరుకుంటారు. ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా పర్యటన నేపధ్యంలో అధికార పార్టీతో పాటు జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇటీవల నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కావడం, వచ్చే నెల రోజుల్లో నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ నల్లగొండ జిల్లాతోపాటు తెలంగాణ ప్రజలపై వరాల జల్లు కురిపించనున్నట్లు సమాచారం.

Read Also… ప్రశాంతంగా తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.. తుది విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu