Telangana Election: కామారెడ్డి, గజ్వేల్ స్థానాల నుంచి బరిలోకి సీఎం.. ప్రత్యర్థుల స్పీడ్‌తో అప్రమత్తమైన బీఆర్ఎస్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. రెండు నియోజక వర్గాలను విపక్షాలు టార్గెట్ చేయడంతో.. సీరియస్‌గా తీసుకున్నారు అధికార పార్టీ నేతలు. ముదిరాజ్ సామాజికవర్గ నేతల చేరికలతో పాటు.. కులసంఘాల మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఓట్లు చీలకుండా పక్కా ఫ్లాన్ వేస్తున్నారు గులాబీ నాయకులు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. రెండు నియోజక వర్గాలను విపక్షాలు టార్గెట్ చేయడంతో.. సీరియస్‌గా తీసుకున్నారు అధికార పార్టీ నేతలు. ముదిరాజ్ సామాజికవర్గ నేతల చేరికలతో పాటు.. కులసంఘాల మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఓట్లు చీలకుండా పక్కా ఫ్లాన్ వేస్తున్నారు గులాబీ నాయకులు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజక వర్గాలను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. అటు గజ్వేల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఇద్దరు ప్రతిపక్ష ముఖ్యనేతలు సీఎం కేసీఆర్‌తో తలపడుతుండటంతో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. వీరికి మద్దతుగా కేంద్ర నాయకత్వం ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయింది. మంత్రి హరీష్ రావుకు కామారెడ్డి నియోజకవర్గ బాధ్యతలు, మరో మంత్రి కేటీఆర్‌కు గజ్వేల్ నియోజకవర్గ గెలుపు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. మరోవైపు పరిస్థితులు తమ అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.
అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో సీఎం కేసీఆర్ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండు నియోజకవర్గం పార్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కేసీఆర్ అయీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గం ఓటర్లే టార్గెట్ గా ఈటెల రాజేందర్ గజ్వేల్‌లో ప్రచారం చేస్తున్నడంతో .. ఇతర పార్టీలోని ఆ సామాజిక వర్గ నేతలను బీఆర్ఎస్‌లో వరుసగా చేర్చుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరి ముదిరాజ్ తో పాటు కాంగ్రెస్ నుంచి నగేష్ ముదిరాజ్ చేరారు.
ఇక కామారెడ్డిలో బీఆర్ఎస్ ఎలక్షన్ గ్రౌండ్ స్పీడ్ అప్ చేశారు. మంత్రులు కుల సంఘాల మీటింగ్‌లతో కామారెడ్డిలో హడావిడి చేశారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్ బీసీ, మైనార్టీ, ఎస్టీ కుల సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రెడ్డి సంఘం మీటింగ్ రద్దయింది. కామారెడ్డి బైపాస్ రోడ్డుపై స్థానికులతో సమావేశమైన కేటీఆర్.. కామారెడ్డి మాస్టర్ ఫ్లాన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రైతులపై పెట్టిన కేసులు కూడా ఇతరాలు చేసుకోవాలని బీజేపీకి సూచన చేశారు.
2014 ఎన్నికల్లో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో 2018లో సరైన ప్రత్యర్థి లేకుండానే సీఎం కేసీఆర్ సునాయసంగా గెలిచారు. కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధమైన కేసీఆర్ రెండు నెలల నుంచి అక్కడ పల్లె అభివృద్ధి పనులు చేశారు. దాదాపు 300 కోట్లతో రోడ్లు , సెంట్రల్ లైటింగ్ , డ్రైనేజీ లాంటి పనులు పూర్తి చేశారు. నామినేషన్ వేస్తున్న తొమ్మిదో తేదీన కామారెడ్డిలో ప్రచారం చివరి రోజు 28న గజ్వేల్‌లో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇక నవంబర్ 30న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…