AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో కొనసాగుగున్న సీఎం చంద్రబాబు పర్యటన.. హైదరాబాద్ రాక ఎప్పుడంటే..

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. మూడో రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు సీఎం చంద్రబాబు. నిన్న ప్రధాని మోదీ, అమిత్‌షా సహా ఇతర కేంద్రమంత్రులతో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఇవాళ మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. జూలై 5న ఉదయం 9గంటలకి నీతి ఆయోగ్‌ సీఈవో సుబ్రహ్మణంతో సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించనున్నారు.

ఢిల్లీలో కొనసాగుగున్న సీఎం చంద్రబాబు పర్యటన.. హైదరాబాద్ రాక ఎప్పుడంటే..
Cm Chandrababu
Srikar T
|

Updated on: Jul 05, 2024 | 8:06 AM

Share

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. మూడో రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు సీఎం చంద్రబాబు. నిన్న ప్రధాని మోదీ, అమిత్‌షా సహా ఇతర కేంద్రమంత్రులతో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఇవాళ మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. జూలై 5న ఉదయం 9గంటలకి నీతి ఆయోగ్‌ సీఈవో సుబ్రహ్మణంతో సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించనున్నారు. ఇప్పటి వరకూ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలకు సంబంధించిన నివేదికను సమర్పించనున్నారు. కేంద్ర బడ్జెట్ రూపొందిస్తున్న నేపథ్యంలో ఏపీకి అధిక నిధులు విడుదల సహా, మరిన్ని ప్రయోజనకరమైన అంశాలు కేంద్ర బడ్జెట్లో పొందుపరచాలని విజ్ఙప్తి చేయనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అనంతరం ఉదయం 10.45కి కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ఏపీకి పలు మెడికల్ కాలేజీల అభివృద్దికి సంబంధించి పనులు వేగంగా జరిగేలా, తగినంత నిధుల సమకూర్చేలా సహాయసహకారాలు అందజేయాలని కోరనున్నారు.

అలాగే మధ్యాహ్నం 12.30కు రాజ్యసభ సభ్యులు ప్రస్తుత కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలేతో భేటీ అయి రాష్ట్రంలోని యువతకు సాధికారత అందించేందుకు దోహదపడాలని విన్నవించనున్నారు. అమరావతి రాజధాని, పోలవరం సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలు, జపాన్‌ రాయబారిని కలవనున్నారు సీఎం చంద్రబాబు. వీరందరితో సమావేశాలు ముగించుకుని ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ పయనమవుతారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి ఆయన నివాసానికి చేరుకుంటారు. సీఎం చంద్రబాబు రాకతో హైదరాబాద్ నగరం మొత్తం పసుపు వర్ణశోభితంగా కనిపిస్తోంది. ఎటు చూసినా పార్టీ జెండాలు, సీఎం చంద్రబాబు ఫ్లెక్సీలతో అడుగడుగునా ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్దం చేశారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. నాల్గవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు సీఎం చంద్రబాబు. అలాగే జూలై 6న మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడంతో అందరిలో తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…