Telangana: బీఆర్ఎస్‎లో మరో కుదుపు.. పెద్ద ఎత్తున కాంగ్రెస్‎లో చేరిన ఎమ్మెల్సీలు..

తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు ఏర్పడింది. బీఆర్‌ఎస్‌కి ఆరుగురు ఎమ్మెల్సీలు బిగ్‌ షాకిచ్చారు. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యారు. సీఎం రేవంత్‌ సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిని కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్‌ మున్షీ. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కి చేరింది. మీడియా కంట పడకుండా వెనుక గేట్‌ నుంచి సీఎం రేవంత్ ఇంటి లోపలికి వెళ్లారు ఎమ్మెల్సీలు.

Telangana: బీఆర్ఎస్‎లో మరో కుదుపు.. పెద్ద ఎత్తున కాంగ్రెస్‎లో చేరిన ఎమ్మెల్సీలు..
Congress Party
Follow us

|

Updated on: Jul 05, 2024 | 6:56 AM

తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు ఏర్పడింది. బీఆర్‌ఎస్‌కి ఆరుగురు ఎమ్మెల్సీలు బిగ్‌ షాకిచ్చారు. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యారు. సీఎం రేవంత్‌ సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిని కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్‌ మున్షీ. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కి చేరింది. మీడియా కంట పడకుండా వెనుక గేట్‌ నుంచి సీఎం రేవంత్ ఇంటి లోపలికి వెళ్లారు ఎమ్మెల్సీలు. ఇప్పటికే ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరగా తాజాగా చేరిన ఎమ్మెల్సీలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు హాట్ టాపిక్‎గా మారింది. బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. కేసీఆర్‌ భరోసా ఇస్తున్నా చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్‌ బీఆర్‌ఎస్‌దే, ఎవరూ తొందరపడొద్దని కేసీఆర్‌ చెప్పిన రెండోరోజే ఆ పార్టీకి భారీ షాక్‌ తగిలింది.

ఇప్పటివరకూ ఎమ్మెల్యేలే అనుకుంటే.. తాజాగా ఎమ్మెల్సీలు కూడా అదేబాట పట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చీరాగానే కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు. బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్‌రావు, దయానంద్, ఎగ్గే మల్లేష్.. ఈ ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. వీళ్లందరికీ కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీకాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ. తాజా చేరికలతో మండలిలో 12కి పెరిగింది కాంగ్రెస్‌ బలం. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే.. ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38మందిలో కాంగ్రెస్‌కు నిజానికి నలుగురు మాత్రమే ఉన్నారు. మిగతా 8మంది బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చినవాళ్లే. ఇక బీజేపీకి ఒకరు, ఎంఐఎంకు ఒక ఎమ్మెల్సీ ఉండగా.. ఇద్దరు ఇండిపెండెంట్స్‌ ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!