బ్రేకింగ్… నగర శివారులో చిరుత హల్‌చల్…

ఓ వైపు కరోనా మహమ్మారితో వణికిపోతున్న నగర శివారు ప్రజలకు.. చిరుత భయంపట్టుకుంది. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుత ప్రత్యక్షమైంది. జాతీయ రహదారి ఎన్‌హెచ్‌7 సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ రోడ్డుపై ఓ పక్కన కూర్చొంది. అయితే అటుగా వాహనాలు పొతున్నప్పటికీ అది ఓ మూలన కూర్చుండిపోయింది. చిరుతను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు చిరుత ఉన్న ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. దానికి తీవ్రంగా గాయాలవ్వడంతో.. అది కదలకుండా […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:07 am, Thu, 14 May 20
బ్రేకింగ్... నగర శివారులో చిరుత హల్‌చల్...

ఓ వైపు కరోనా మహమ్మారితో వణికిపోతున్న నగర శివారు ప్రజలకు.. చిరుత భయంపట్టుకుంది. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుత ప్రత్యక్షమైంది. జాతీయ రహదారి ఎన్‌హెచ్‌7 సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ రోడ్డుపై ఓ పక్కన కూర్చొంది. అయితే అటుగా వాహనాలు పొతున్నప్పటికీ అది ఓ మూలన కూర్చుండిపోయింది. చిరుతను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు చిరుత ఉన్న ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. దానికి తీవ్రంగా గాయాలవ్వడంతో.. అది కదలకుండా అక్కడే కూర్చుండిపోయింది.

అయితే.. చిరుత గురించి పోలీసులు అటవీ అధికారులకు సమాచారం అందించి.. అటువైపుగా వచ్చే వాహనాలను దారిమళ్లించారు. అటవీశాఖ, జూపార్క్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయత్నించగా.. అంతలోనే ఆ చిరుత వారి నుంచి తప్పించుకుని సమీపంలో ఫంక్షన్‌హాలులోకి వెళ్లింది. ఈ క్రమంలో ఓ వ్యక్తిని గాయపరిచింది. వెంటనే పోలీసులు.. సదరు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.