Telangana: వేములవాడ రాజన్న సన్నిధిలో చిన్నారి కిడ్నాప్.. తల్లికి మద్యం తాగించి దారుణం

కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ఓ మహిళ నాలుగు రోజులుగా వేములవాడ రాజన్న ఆలయం మెట్ల వద్ద ఉంటోంది. కుటుంబ కలహాలతో లావణ్యను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరు కుమారులతో కలిసి..

Telangana: వేములవాడ రాజన్న సన్నిధిలో చిన్నారి కిడ్నాప్.. తల్లికి మద్యం తాగించి దారుణం
Vemulawada Temple
Follow us
Sanjay Kasula

|

Updated on: May 16, 2022 | 1:23 PM

ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం వద్ద శిశువు అపహరణకు గురైంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 28 రోజుల పసివాడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ఓ మహిళ నాలుగు రోజులుగా వేములవాడ రాజన్న ఆలయం మెట్ల వద్ద ఉంటోంది. కుటుంబ కలహాలతో లావణ్యను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరు కుమారులతో కలిసి అక్కడే ఒంటరిగా ఉంటోంది. దీనిని గమనించిన దుండగులు..చిన్నారిని అపహరించేందుకు పథకం పన్నారు. ఆదివారం రాత్రి లావణ్యకు మద్యం తాగించి వేకువజామున శిశువును ఎత్తుకుని పరారయ్యారు. తన కుమారుడు కిడ్నాప్ అయ్యాడంటూ బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కంప్లైంట్ తో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దేవస్థానాల్లో ఇటీవల వరసగా జరుగుతున్న చిన్నారుల కిడ్నాప్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి.

తిరుమల, యాదాద్రిలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చిన తమను.. ఇలా చిన్నారులను అపహరించే ముఠాలు భయం పుట్టిస్తున్నాయని పలువులు చెబుతున్నారు. పోలీసులు స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తెలంగాణ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: AP: నీళ్లలో ఏవో తేలుకుంటూ వచ్చాయ్ అనుకోకండి.. అసలు విషయం తెలిస్తే కళ్లు తేలేస్తారు..

Telangana: బెట్టింగ్ వేసి ఉద్దరించినవాళ్లు ఎవరూ లేరు.. ఇతనిలా బలైపోయినవాళ్లు తప్ప

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?