Telangana: భాగ్యలక్ష్మి ఆలయానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. సవాల్ ను బీజేపీ స్వీకరిస్తుందా.. లేదా.. ?

|

Dec 18, 2022 | 7:51 AM

రెండు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాటల యుద్ధం సాగుతోంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చినట్టు...

Telangana: భాగ్యలక్ష్మి ఆలయానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. సవాల్ ను బీజేపీ స్వీకరిస్తుందా.. లేదా.. ?
Mla Pilot, Raghunandan
Follow us on

రెండు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాటల యుద్ధం సాగుతోంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చినట్టు గానీ, ఎఫ్ఐఆర్ లో తన పేరున్నట్టు గానీ నిరూపించాలని రోహిత్ ఛాలెంజ్ చేయగా.. మీరు డ్రగ్స్ ఎన్నడూ ముట్టలేదని ప్రమాణం చేయగలరా? అని రఘు నందన్ ప్రతి సవాల్ విసిరారు. దీంతో చార్మి్నార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వస్తోన్న రోహిత్ రెడ్డి.. రఘునందన్ సవాల్ స్వీకరిస్తారా?లేదా అనేది తెలంగాణ పొలిటికల్ లో హీట్ పెంచుతోంది. తెలంగాణలో సవాళ్ల పర్వం ఒక అడుగు ముందుకేసి.. దేవుని ప్రమాణాల పర్వంగా మారింది. తనకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చినట్టు గానీ ఎఫ్ఐఆర్ లో పేరున్నట్టు నిరూపించాలని రోహిత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. అంతే కాదు అందుకు తగిన ఆధారాలుంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని తాండూరు ఎమ్మెల్యే సవాల్ విసిరారు.

అయితే ఇదే అంశంపై స్పందించాల్సిన బండి సంజయ్ నుంచి నో ఆన్సర్. అయితే ఎమ్మెల్యే రఘునందన్ నుంచి రిప్లై వచ్చింది. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిజంగా సంబంధమే లేకుంటే.. డ్రగ్స్ ఎన్నడూ ముట్టలేదని ప్రమాణం చేయాలని. సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే. అంతే కాదు దేవుడిపైనే నమ్మకం లేని బీఆర్ఎస్ లీడర్లకు ఈ ప్రమాణాలేంటని నిలదీశారు. బండి సంజయ్ అన్న తర్వాతే ఇలాంటి నోటీసులు, ఈడీ పిలుపులు వస్తున్నాయని బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారనీ. అయితే బండి సంజయ్ అలా అన్నట్టు ఎక్కడైనా ఉంటే ఆధారాలు చూపాలని అన్నారు రఘునందన్. ఆయన పాదయాత్రలో మాట్లాడిన మాటలు కావాలంటే వినాలనీ. ఇలాంటి పదాలు బండి ఎక్కడైనా అని ఉంటే తమకు చూపాలన్నారు దుబ్బాక ఎమ్మెల్యే.

ఇవన్నీ ఇలా ఉంటే ఈ రోజు ఉదయం పదిగంటలకు పైలట్ రోహిత్ రెడ్డి తిరిగి భాగ్యలక్ష్మి ఆలయానికి రానున్నారు. మరి ఈసారికి ఆయన ఎలాంటి సవాల్ విసరనున్నారు? ఇందుకు బీజేపీ కౌంటర్ అటాక్ ఎలా ఉండబోతుంది? అన్న ఉత్కంఠకు తెరలేచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..