AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chikoti Praveen: చీకోటి ప్రవీణ్ సంచలన నిర్ణయం.. అతి త్వరలో కొత్త పార్టీ..?

గ్రాండ్‌గా వెళ్లి.. కమల తీర్థం పుచ్చుకోవాని వెళ్తే.. అంత పెద్ద క్యాసినో కింగ్‌ను అవమానించింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. పార్టీలో చేరిక విషయం పక్కన పెట్టండి. కనీసం ఆఫీసుకు వెళ్లిన చీకోటిని కనీసం రిసీవ్ చేసుకునేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో ఆయనకు తల కొట్టేసినంత పనైయ్యింది. కాసేపు వెయిట్ చేసి చూసినా.. నో అప్‌డేట్. ఈ పరిణామంపై చీకోటి ప్రవీణ్ తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఆయన సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్ల సమాచారం.

Chikoti Praveen: చీకోటి ప్రవీణ్ సంచలన నిర్ణయం.. అతి త్వరలో కొత్త పార్టీ..?
Chikoti Praveen
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 14, 2023 | 7:54 PM

Share

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు యమ రంజు మీద ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడటంతో అన్ని పార్టీలు తమ యాక్షన్ ప్లాన్స్‌ను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ జంపింగ్స్.. ప్రధాన పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో.. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు చికోటి ప్రవీణ్‌. అయితే.. ఆయన బీజేపీలో చేరికపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీలో చేరేందుకు ఆయన అంతా సిద్దం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంగళవారం భారీ సంఖ్యలో ఫాలోవర్స్‌ను సమీకరించారు. పెద్ద సంఖ్యలో తన ఫాలోవర్స్‌తో కలిసి కర్మన్‌ఘాట్‌ నుంచి నాంపల్లి వరకు ప్రవీణ్ ర్యాలీగా తరలివెళ్లారు. కానీ.. చివరి నిముషంలో బీజేపీలో చికోటి ప్రవీణ్‌ చేరికకు బ్రేకులు పడ్డాయి. అయితే.. ఎంతో ఆశగా.. గ్రాండ్‌గా వెళ్లి.. కమల తీర్థం పుచ్చుకోవాని వెళ్తే.. అంత పెద్ద క్యాసినో కింగ్‌ను అవమానించింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. పార్టీలో చేరిక విషయం పక్కన పెట్టండి. కనీసం ఆఫీసుకు వెళ్లిన చీకోటిని కనీసం రిసీవ్ చేసుకునేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో ఆయనకు తల కొట్టేసినంత పనైయ్యింది. కాసేపు వెయిట్ చేసి చూసినా.. నో అప్‌డేట్. ఈ పరిణామంపై చీకోటి ప్రవీణ్ తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ నుంచి సినిమా వాళ్ల వరకు పరిచయాలు ఉండి.. క్యాసినో కింగ్‌గా పేరు సంపాదించుకున్న చీకోటికి ఇలా అవమానం జరగడంపై అతడి ఫాలోవర్స్ సైతం గట్టిగానే ఫీలయ్యారు.

తన చేరిక బీజేపీలో కొందరికి నచ్చడం లేదని చీకోటి ప్రవీణ్‌ ఫిక్సయ్యారు. ఈ క్రమంలోనే ఘాటుగా స్పందించారు. తనంటే భయం ఎవరికో అర్థమైందని, తనను ఎవరూ ఏం చేయలేరని అన్నారు. మీ రాజకీయం మీరు చేయండి.. నా రాజకీయం నేను చేస్తా అని సవాల్ విసిరారు. తాజా అప్‌డేట్ ఏంటి అంటే.. ఆయన కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఆ దిశగా ఆయన్ను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారంతా ప్రవీణ్‌ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేశారట. ఇది కులానికి జరిగిన అవమానంగా భావించి.. కొత్త పార్టీ పెట్టాలని కోరుతున్నారట. కలిసి వచ్చే హిందుత్వ సంస్థలను కలుపుకుని.. పార్టీ పెట్టేందుకు ఆయన్ను ప్రొత్సహిస్తున్నారట. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. అతి త్వరలోనే ఢిల్లీ వెళ్లి కొత్త పార్టీ సంబంధించిన ప్రాసెస్ మొదలు పెట్టాలని సూచిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే పలు హిందూ సంఘాల మద్దతు కూడా ఆర్యవైశ్య మహాసభ నాయకులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. మరి ఆయన పార్టీ పెడతారా..? ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందా.. దిగితే ప్రభావం చూపుతుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us