Telangana: వెల్లుల్లి లోడ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. అడుగున ఉంది నికార్సయిన సరుకు
గంజాయి స్మగ్లింగ్ చేసే మెయిన్ వ్యక్తులు దొరకడం లేదు. మధ్యలో డబ్బులకు ఆశపడి రవాణా చేసే వ్యక్తులను అసలైన స్మగ్లర్స్ పావులుగా వాడుకుంటున్నారు.
ఎర్రచందనం, గంజాయి, డ్రగ్స్ వంటి వాటి స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడం అధికారులకు, పోలీసులకు పెద్ద చాలెంజ్‌గా మారుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. రోజుకో కొత్త మార్గంలో అక్రమార్కులు ఈ దందాలను రన్ చేస్తున్నారు. స్పెషల్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేస్తున్నా… డ్రగ్స్(Drugs), గంజాయి(Cannabis) స్మగ్లర్లు క్రియేటివ్‌గా ఆలోచిస్తూ మత్తును రవాణా చేస్తున్నారు. అవగాహన కల్పించినా..గంజాయి జోలికి వెళ్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించినా దందాకు మాత్రం కళ్లెం పడటం లేదు. ఇప్పుడు… అందుగలదు.. ఇందు లేదు అని సందేహం వలదు.. ఎందెందు వెతికినా.. పోలీసులకు గంజాయి కనిపిస్తూనే ఉంది. . పుష్ప(Pushpa) సినిమాలో రెడ్ శాండిల్(Red sandalwood) అక్రమంగా తరలించేందుకు హీరో అల్లు అర్జున్ అనుసరించిన ట్రిక్స్‌ను మించిన ట్రిక్స్ గంజాయి స్మగ్లర్స్ అనుసరిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం డ్రగ్స్, గంజాయి పట్టుబడుతున్న కేసులు మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజూ ఏదో ఒక చోటా ఈ మత్తు రవాణా గుట్టు రట్టవుతూనే ఉంది. తాజాగా భద్రాచలంలో 58 లక్షల విలువ చేసే 390 కేజీల గంజాయి పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వెల్లుల్లి లోడ్ స్కెచ్ వేశారు. కానీ అధికారులు లోతుగా తనిఖీలు చేయడంతో బాగోతం బటయపడింది. వెల్లుల్లి లోడ్ మాటన తరలిస్తున్న గంజాయిని గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మినీ వ్యాన్ సీజ్ చేసి, ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.