AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS SSC Results 2025 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడు.. ఇదిగో క్లారిటీ..?

తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడు..? దీనిపై స్పష్టత కొరవడింది. అయితే ఏప్రిల్ నెల ముగిసేసరికి ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలు ఇవ్వాలని అధికారులు ధృడ నిశ్చయంతో ఉన్నారు. ఫలితాల కోసం దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TS SSC Results 2025 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడు.. ఇదిగో క్లారిటీ..?
TS-SSC-Results-2025
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Apr 28, 2025 | 1:49 PM

Share

తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ చివరి నాటికి రిజల్ట్స్ ఇవ్వాలని ఎదురుచూస్తున్న ఎస్ఎస్‌సీ బోర్డు ప్రభుత్వ అనుమతి కోసం వెయిట్ చేస్తోంది. దాదాపుగా ఏప్రిల్ నెల 30న ఫలితాలు విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బుధ, గురువారాల్లో ఎప్పుడైన రిజల్ట్స్ రిలీజ్ చెయోచ్చంటూ అధికారులు చెబుతున్నారు. స్పాట్ వాల్యుయేషన్, కంప్యూటరైజేషన్, పరిశీలన సహా ప్రాసెస్ అంతా పూర్తి చేసి విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమైంది.

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తర్వాత సమాధాన పత్రాల స్పాట్ వాల్యుయేషన్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం వేగంగా జరిపింది. ఏప్రిల్ 7 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమై, రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశిత కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. మార్కుల టేబులేషన్, ఆన్‌లైన్ అప్‌లోడ్ ప్రక్రియ కూడా దాదాపు కంప్లీట్ అయింది. ఈ సంవత్సరం గ్రేడింగ్ విధానాన్ని తొలగించి, మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఫలితాల్లో పారదర్శకత పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్ల అధికారులు చెబుతున్నారు.

మార్కులా.. గ్రేడింగా.. గందరగోళం:

పలు విద్యాసంస్థల ఎంట్రన్స్ పరీక్షల్లో టెన్త్ మార్కుల వెయిటేజీ కారణంగా ఈ సారి గ్రేడింగ్ బదులు మార్కులను ఇవ్వాలని విద్యాశాఖ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పదో తరగతి ఫలితాలను మార్కుల రూపంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రేడింగ్ తీసేసి మార్కులు ఇస్తే విద్యార్థులపై ప్రభావం పడుతుందా అన్నదానిపై సమాలోచనలు జరిగినట్లు సమాచారం. విద్యార్థుల్లో మెమోల్లో గతంలో మాదిరి గ్రేడ్స్ కూడా ఇచ్చి మార్కులను జత చేయనున్నట్లు అధికారులు చెబతున్నారు. ఇందుకోసమే ఫలితాల విడుదల ఆలస్యం అవుతుందని చర్చ నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు