లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశామన్నారు. అద్భుతమైన విజయాల తోపాటు అనేక ఎదురుదెబ్బలు, ఎదుర్కొన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతి పెద్ద గౌరవమన్నారు కేటీఆర్.
ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. 2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, 2018లో 88 అసెంబ్లీ స్థానాలతో రెండవసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నాం. ప్రజా పక్షాన పోరాడేందుకు అవకాశమిచ్చారన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతామన్నారు కేటీఆర్.
In the last 24 years since TRS was founded, we have seen it all. Stellar achievements, successes and also many setbacks
The greatest glory: formation of Telangana state will remain our Biggest achievement
Being a regional party won two consecutive state elections with a good…
— KTR (@KTRBRS) June 4, 2024
ఈరోజు వచ్చిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కచ్చితంగా నిరాశను కలిగించాయన్నారు. అయినా ఎప్పటిలాగే మరింత కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్న విశ్వాసం ఉందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటామన్నారు.
కాగా, తెలంగాణలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ క్రమంగా తమ పట్టును రాష్ట్రంలో కోల్పోతోంది. గత ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలకే పరిమితిమవ్వగా.. ఈ ఎన్నికల్లో ఆ సంఖ్యను డబల్ చేసుకునేలా కనిపిస్తోంది. తాజా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి 8, కాంగ్రెస్ పార్టీకి 8, ఎంఐఎంకు 1 సీటు రానున్నట్లు ఇప్పటివరకు వచ్చిన ఫలితాల బట్టి అర్థం అవుతోంది. బీఆర్ఎస్ రాష్ట్రంలో ఖాతానే తెరవలేదు. మెదక్‌లో బీఆర్ఎస్ రెండో స్థానానికే పరిమితమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…