Telangana: బీఆర్‌ఎస్‌లో ఉన్నానని ఎవరు చెప్పారు?.. జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్..

|

Apr 09, 2023 | 10:24 AM

ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్యసాధనలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ రెబెల్‌ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్‌లో ఉన్నానని తానెప్పుడు చెప్పలేదని జూపల్లి స్పష్టం చేశారు. తాను పార్టీలో ఉన్నానో లేదో చెప్పాల్సింది పార్టీ నాయకత్వమే అన్నారు.

Telangana: బీఆర్‌ఎస్‌లో ఉన్నానని ఎవరు చెప్పారు?.. జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్..
Jupally Krishna Rao
Follow us on

ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్యసాధనలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ రెబెల్‌ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్‌లో ఉన్నానని తానెప్పుడు చెప్పలేదని జూపల్లి స్పష్టం చేశారు. తాను పార్టీలో ఉన్నానో లేదో చెప్పాల్సింది పార్టీ నాయకత్వమే అన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న ప్రచారాల గురించి కొత్తగూడెంలో మాట్లాడతానని జూపల్లి కృష్ణారావు అన్నారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్‌పై నిరసనను ప్రజలు ఇప్పటికే స్పష్టం వ్యక్తం చేశారని జూపల్లి తెలిపారు. పార్టీలో ఉంటానా, మారతానా అన్నది ప్రధానం కాదని జూపల్లి అన్నారు.

బీఆర్ఎస్ మరో రెబెల్‌ నేత పొంగులేటి శ్రీనివాసులురెడ్డి కొత్తగూడెంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు జూపల్లి బయలుదేరారు. హైదరాబాద్‌ శివారు తుక్కుగూడలో నుంచి కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా కొత్తగూడెం ప్రయాణమయ్యారు.

జూపల్లి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని ఆయన అభిమానులు అన్నారు. పొంగులేటి శ్రీనివాసులురెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు కొత్తగూడెం బయలుదేరిన జూపల్లికి మద్దతుగా అనేక మంది కొల్లాపూర్‌ నుంచి వచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..