Railway Passenger Alert: రైల్వే ప్రయాణికులు బీ అలెర్ట్.. టిక్కెట్ బుకింగ్‌లో నయా మోసం..
మోసగాళ్ళ నాటకాలకు అడ్డూ అదుపూలేకుండా పోతోంది. ఏకంగా రైల్వే టిక్కెట్లనే డిఫెన్స్‌లో బుక్ చేసి, వేరేవాళ్ళకు అమ్మేశాడు ఓ మోసగాడు. కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తికి డిఫెన్స్ కోటాలో 8 నకిలీ టిక్కెట్లు బుక్ చేసి..
మోసగాళ్ళ నాటకాలకు అడ్డూ అదుపూలేకుండా పోతోంది. ఏకంగా రైల్వే టిక్కెట్లనే డిఫెన్స్‌లో బుక్ చేసి, వేరేవాళ్ళకు అమ్మేశాడు ఓ మోసగాడు. కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తికి డిఫెన్స్ కోటాలో 8 నకిలీ టిక్కెట్లు బుక్ చేసి.. వేరేవాళ్ళకు అమ్మేసి ఎంచక్కా ఉడాయించిన వ్యక్తి ఉదంతం కలకలం రేపుతోంది. కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీ నివాసి రాజు తమ బంధువుల కోసం కామారెడ్డి నుంచి గుంతకల్లుకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలుకి 8 టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు రాయలసీమ రైలు ఎక్కి కూర్చున్నారు ఎనిమిది మంది ప్యాసింజెర్స్. అయితే వాళ్ళు తీసుకున్న టిక్కెట్లు వారివి కావని గుర్తించిన రైల్వే అధికారులు ట్రైన్ దింపేశారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి గుంతకల్ కు వెళ్లేందుకు అశోక్ నగర్ కు చెందిన రాజు.. రైల్వేస్టేషన్ వెళ్లాడు. ఈ క్రమంలో కస్టమ్స్ ఉద్యోగినంటూ తమ కోటాలో టికెట్లు బుక్ చేస్తానంటూ మాయ మాటలు చెప్పిన విజయ్ అనే కేటుగాడు 3500 కాజేశాడు. నకిలీ టిక్కెట్టు పంపి వారిని నమ్మించాడు. అవే టికెట్లతో రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఎక్కగా.. ఆ టికెట్లు పని చేయవని రైల్వే అధికారులు సికింద్రాబాద్ లో దింపేశారు. అయితే, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కస్టమ్ శాఖలో ఉద్యోగిగా పరిచయం చేసుకున్న విజయ్ ఎవరు.. ఎక్కడుంటాడు.. అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నకిలీ టికెట్ల వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..