తెలంగాణలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నింస్తోందని బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. హిందీ పేపర్‌ను బండి వాట్సాప్‌కు పంపించడం కుట్ర కాదా ? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్ట్‌పై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బండి అరెస్ట్‌పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్. ఆ ట్వీట్‌లో పేపర్ లీక్ కుంభకోణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని చెప్పడానికి ఇది మరో నిదర్శనం అంటూ.. పేపర్ లీక్ చేసిన నిందితుడు, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఇక వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ వైరల్ చేసిన నిందితుడు బండి సన్నిహితుడు అంటూ అందులో పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజల మనసు గెల్చుకోలేరన్నారు. లీకేజీలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాళ్లు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని ప్రశ్నించారు వినయ్ భాస్కర్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, చెప్పులతో కొట్టే రోజులు దగ్గరే ఉన్నాయన్నారు. ఈడీ, ఐటీ దాడులతో బెదిరింపులకి దిగుతోందని, అయినప్పటికీ బెదిరే ముచ్చటే లేదన్నారు వినయ్ భాస్కర్.
బండి సంజయ్‌పై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ సంచలన కామెంట్లు చేశారు. పేపర్ లీకేజ్‌లో అతిపెద్ద కుట్రదారు బండి సంజయ్ అని అన్నారు. బండి సంజయ్ వాట్సాప్‌కే ఎందుకు పేపర్ వెళ్లింది? అని ప్రశ్నించారు. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ కుట్రపూరితంగా.. తెలంగాణలో అంతర్గత సంక్షోభం సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు సుదర్శన్. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కొంతమందిని ఎంచుకుని కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు సుదర్శన్.
బండి సంజయ్ అరెస్ట్‌పై స్పందించారు ఎమ్మెల్యే రేగా కాంతారావు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సిగ్గుచేటంటూ ట్వీట్ చేశారాయన.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..