Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ మళ్లీ రచ్చో రచ్చస్య..!
తెలంగాణ అసెంబ్లీలో గురువారం రాజుకున్న నిప్పురవ్వలు.. ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌తో మొదలైన డ్రామా.. దాని తాలూకు వేడి కంటిన్యూ కాబోతున్నట్లు కనిపిస్తోంది. కానీ.. అంతకుమించిన హీటు పక్కా అంటూ ఎక్స్‌ట్రా ఫ్లేవర్లతో తొడలు కొడుతోంది విపక్ష గులాబీ పార్టీ.

రాగల 24 గంటల్లో తెలంగాణ అసెంబ్లీలో మళ్లీ ఉరుములు-మెరుపులు ఖాయమేనా? సెలవు కారణంగా శుక్రవారం(మార్చి14) సద్దుమణిగినా.. ఇవాళ శనివారం (మార్చి 15) మళ్లీ సభ వేడెక్కనుందా..? ఎస్.. మోర్ అండ్ మోర్ యాక్షన్.. మోర్ ఎంటర్‌టైన్‌మెంట్.. కమింగ్ సూన్.. ఎందుకంటే.. ఇవాళ స్పీకర్‌తో కాదు.. ఏకంగా ముఖ్యమంత్రితోనే అమీతుమీ తేల్చుకుంటామంటోంది అపోజిషన్ పార్టీ.
తెలంగాణ అసెంబ్లీలో గురువారం రాజుకున్న నిప్పురవ్వలు.. ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌తో మొదలైన డ్రామా.. దాని తాలూకు వేడి కంటిన్యూ కాబోతున్నట్లు కనిపిస్తోంది. కానీ.. అంతకుమించిన హీటు పక్కా అంటూ ఎక్స్‌ట్రా ఫ్లేవర్లతో తొడలు కొడుతోంది విపక్ష గులాబీ పార్టీ.
నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అంటూ… అనుచిత వ్యాఖ్యల కాన్సెప్ట్‌నే అవకాశంగా తీసుకుంది బీఆర్‌ఎస్. కేసీఆర్‌పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న అభియోగంతో ఫిర్యాదుల పరంపర మొదలుపెట్టింది. పేట్ బషీరాబాద్, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లలో కంప్లెయింట్లు రిజిస్టరయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని స్టేషన్లలో కూడా కేసు పెట్టి, సీఎంను కార్నర్ చేయాలన్న యోచనలో ఉంది బీఆర్‌ఎస్. కేసీఆర్‌ను మార్చురీకి తరలించాలన్న ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలనేది బీఆర్‌ఎస్ నేతల డిమాండ్.
ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ ప్లస్.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన స్ట్రెచర్ కామెంట్.. ఈ రెండు అంశాలను ఎజెండాగా మార్చుకుని ఇవాళ్టి అసెంబ్లీ సమావేశానికి సమాయత్తమవుతోంది విపక్ష బీఆర్‌ఎస్. తను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, పథకం ప్రకారమే సస్పెండ్ చేశారని చెబుతున్న జగదీష్‌రెడ్డి.. అధికారపార్టీతో కయ్యానికి సై అంటున్నారు. ఆయన తరఫున సభలో రగడకు సిద్ధమవుతోంది బీఆర్‌ఎస్. ఇవాళ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఓ నిర్ణయానికి రాబోతోంది గులాబీ పార్టీ.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కనుక.. సభాధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇవాళ అసెంబ్లీకి హాజరవ్వడం పక్కా.. జగదీష్‌రెడ్డి అంశాన్ని సభాహక్కుల కమిటీకి పంపిన అధికారపక్షం.. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేలా లేదు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను ప్రస్తావించి తెగేదాకా లాగడానికి మేమూ రెడీ అంటోంది బీఆర్ఎస్. సో.. అసెంబ్లీ సినిమా మొన్న ఎక్కడ ఆగిందో ఇవాళ అక్కడే మొదలయ్యేలా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. బీ రెడీ ఫర్ బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇన్ తెలంగాణ అసెంబ్లీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..