Warangal Politics: వరంగల్ జిల్లాలో టార్గెట్ అతడే.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార అస్త్రం ఇదేనా..?

మాజీ మంత్రి కడియం శ్రీహరి జంపింగ్ కారు పార్టీకి ఫుల్ బూస్టింగ్‌లా మారింది. ఎన్నికల వేల ఆ పార్టీకి ప్రచారాస్త్రంగా దొరికింది. ప్రచారంలో స్పీడు పెంచిన గులాబీ నేతలు కడియం భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను తూర్పాల పడుతున్నారు. కడియం శ్రీహరి నిత్యం మాట్లాడే విలువలు నీకు ఉంటే బీఆర్ఎస్ జెండా పై గెలిచిన ఎమెల్యే పదవికి రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Warangal Politics: వరంగల్ జిల్లాలో టార్గెట్ అతడే.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార అస్త్రం ఇదేనా..?
Brs On Kadiyam Srihari
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 02, 2024 | 10:16 AM

మాజీ మంత్రి కడియం శ్రీహరి జంపింగ్ కారు పార్టీకి ఫుల్ బూస్టింగ్‌లా మారింది. ఎన్నికల వేల ఆ పార్టీకి ప్రచారాస్త్రంగా దొరికింది. ప్రచారంలో స్పీడు పెంచిన గులాబీ నేతలు కడియం భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను తూర్పాల పడుతున్నారు. కడియం శ్రీహరి నిత్యం మాట్లాడే విలువలు నీకు ఉంటే బీఆర్ఎస్ జెండా పై గెలిచిన ఎమెల్యే పదవికి రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల వేల బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రీహరి రూపంలో ప్రచార అస్త్రం దొరికిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కడియం శ్రీహరి మాట్లాడిన నీతి వాఖ్యాలు.. విలువలు ఎక్కడికి పోయాయని, కూతురి కోసం విలువలు తాకట్టు పెట్టావా..? అని ఓ రేంజ్ లో కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తున్నారు.

కడియం పార్టీ మారిన తర్వాత మొట్టమొదటిసారి వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులతో సహా ముఖ్యనేతలు హాజరయ్యారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు.

కడియం శ్రీహరి పార్టీ మారడానికి మూడు నెలల ముందే కుట్ర జరిగిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆరూరి రమేష్, పసునూరి దయాకర్‌లను కడియం శ్రీహరి పార్టీ ఉద్దేశ పూర్వకంగా పార్టీ నుండి వెళ్లగొట్టాడన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లకు కడియం శ్రీహరి వెన్నుపోటు పొడిచి నీచపు రాజకీయాలు చేశారని పల్లా విరుచుకుపడ్డారు. వెన్నుపోటు పొడవడంలో కడియం శ్రీహరి బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం తన వద్ద ఉందని, భారతం పడతా బిడ్డా అని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు

కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే, మంత్రి పదవి ఇప్పించింది కూడా నేనే. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఆయన బిడ్డను ఓడకొట్టడంలో ముందుండేది కూడా నేనే అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్‌ పార్టీలో టికెట్ ఆశావాహుల సంఖ్య పెరిగింది. 25 మందికి పైగా వరంగల్ టికెట్ అశిస్తున్నారు. కడియంను ఓడగొట్టడానికి కసితో ఉన్నారన్నారు ఎర్రబెల్లి.

కడియం శ్రీహరి పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కసి ఎక్కువగా వచ్చి ద్రోహి పోయిన ఆనందం కనిపిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కడియం శ్రీహరికి కల్పించినన్ని అవకాశాలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరికీ కల్పించలేదు… నీతి- నిజాయితీ నైతిక విలువలు ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అంటున్నారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టేనని, పార్టీ మారిన వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు.

కడియం శ్రీహరి పార్టీ మార్పుతోనే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో కసి మరింత ఉత్సాహం పెరిగిందని చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు ఛాన్స్ దొరికితే చాలు కడియం శ్రీహరి ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. ఒకరి కంటే మరొకరు ఎక్కువ అన్నట్లు కడియం శ్రీహరి పై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ డీలా పడిందన్న టాక్ జరుగుతున్న సమయంలో కడియం శ్రీహరి లాగా బీఆర్ఎస్ కు ప్రచారాస్త్రం దొరికిందని జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

చూడ్డానికి జెంటిల్ మెన్‌లా ఉన్నాడనుకుంటే పొరపాటే..
చూడ్డానికి జెంటిల్ మెన్‌లా ఉన్నాడనుకుంటే పొరపాటే..
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!