Vikarabad: ట్రైన్‌లో పోలీసుల తనిఖీలు.. ఏసీ భోగి వెలుపల రెండు అనుమానాస్పద బ్యాగులు.. తెరిచి చూడగా!

భువనేశ్వర్ టూ ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్.. అప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను క్రాస్ చేసింది. అటు ఏసీ, ఇటు స్లీపర్ భోగీల్లోకి ఎక్కిన ప్రయాణీకులు వారి సీట్లలో కూర్చుని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఇక ఆ రైలులోని ఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రతీ కోచ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా..

Vikarabad: ట్రైన్‌లో పోలీసుల తనిఖీలు.. ఏసీ భోగి వెలుపల రెండు అనుమానాస్పద బ్యాగులు.. తెరిచి చూడగా!

|

Updated on: Apr 02, 2024 | 10:56 AM

భువనేశ్వర్ టూ ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్.. అప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను క్రాస్ చేసింది. అటు ఏసీ, ఇటు స్లీపర్ భోగీల్లోకి ఎక్కిన ప్రయాణీకులు వారి సీట్లలో కూర్చుని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఇక ఆ రైలులోని ఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రతీ కోచ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఏసీ కోచ్‌ల దగ్గరకు రాగానే.. బెడ్‌ షీట్స్, బెడ్స్ స్టోర్ చేసే కంపార్ట్‌మెంట్‌లో రెండు బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. గంజాయి ఒక్కసారిగా గుప్పుమంది. కోచ్ అటెండెంట్ మనోజ్, ప్యాంట్రీ వెండర్ అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు గత కొద్దిరోజులుగా ఈ అక్రమ గంజాయి సరఫరాను కొనసాగిస్తున్నట్టు తేలింది.

వారి దగ్గర నుంచి సుమారు 14 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వికారాబాద్ రైల్వే పోలీసులు. సుమారుగా రూ. 2.40 లక్షలు విలువ చేసే ఈ గంజాయిని మధ్యప్రదేశ్‌లోని బరంపురంలో తక్కువ ధరకు.. ఒక కేజీ సుమారు వెయ్యి, పదిహేను వందల చొప్పున కొనుగోలు చేసి ముంబైలో రూ. 20 వేలకు కేజీ చొప్పున అమ్ముతారని పోలీసులు చెప్పారు. కాగా, ఈజీ మనీ సంపాదించే క్రమంలో వీరిద్దరూ గంజాయి సరఫరా చేస్తున్నారని.. వీరిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు రైల్వే సీఐ వెంకటరత్నం చెప్పారు.

Follow us