MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు.. సముద్ర గర్భంలో..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జన్మదినం నేడు. 1978 మార్చి 13వ తేదీన జన్మించారు. కవిత పుట్టిన రోజును పురస్కరించుకొని ఆమె అభిమానులు , బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో విషెస్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే...

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు.. సముద్ర గర్భంలో..
Mlc Kavitha

Updated on: Mar 13, 2023 | 7:44 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జన్మదినం నేడు. 1978 మార్చి 13వ తేదీన జన్మించారు. కవిత పుట్టిన రోజును పురస్కరించుకొని ఆమె అభిమానులు , బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో విషెస్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసి అభిమానాన్ని చాటుకున్నాడు.

అండమాన్ నికోబార్ దీవుల్లో బంగళా ఖాతం సముద్రపు అంచుల లోకి వెళ్లిన చిన్నుగౌడ్, ఇతరులు ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. నీటి అడుగున డైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనంతటినీ వీడియోగా చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియోను టీస్ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ గారి చేతుల మీదుగా ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న కవిత శనివారం ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక కవితను మరోసారి 16వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాల్సిందింగా ఆదేశించిన విషయం విదితమే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కవిత పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..