CM KCR: అధికారం మాదే.. మా అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

Telangana assembly: తెలంగాణ రాష్ట్రం దేశంలో సంక్షేమ పథంలో పయనిస్తోందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతులకు రుణ మాఫీ, దళితబంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 24 గంటల కరెంట్‌ అందిస్తున్నామని, తెలంగాణలో తాగునీరు, సాగునీరుకు ఢోకా లేదన్నారు. ధరణిని తీసేసి ఏం చేస్తారని విపక్షాలను ప్రశ్నించారు కేసీఆర్‌.

CM KCR: అధికారం మాదే.. మా అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
CM KCR

Updated on: Aug 06, 2023 | 5:57 PM

హైదరాబాద్, ఆగస్టు 6: మా అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి.. తెలంగాణలో అధికారం మళ్లీ మాదే.. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయి.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. అదే రీతిలో కాంగ్రెస్ సహా.. బీజేపీపై కూడా సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఆదివారం సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం – సాధించిన ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తొమ్మిదేళ్ల రాష్ట్ర ప్రగతి ప్రస్థానం గురించి వివరించడంతోపాటు పలు విషయాల గురించి చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, సాగునీరు, తాగునీరు, వ్యవసాయం సహా పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. నెల రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని.. కాంగ్రెస్ చెప్పే 2 లక్షల రూపాయల రుణ మాఫీని ఎవ్వరూ నమ్మరంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథంలో దేశంలోనే అగ్రస్థానంలో పయనిస్తోందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతులకు రుణ మాఫీ, దళితబంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 24 గంటల కరెంట్‌ అందిస్తున్నామని, తెలంగాణలో తాగునీరు, సాగునీరుకు ఢోకా లేదన్నారు. ధరణిని తీసేసి ఏం చేస్తారని విపక్షాలను ప్రశ్నించారు కేసీఆర్‌. అంతేకాకుండా తెలంగాణ అభివృద్ధిలో దేశంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణలో మళ్లీ అధికారం చేపడతామని.. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయంటూ సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని.. కానీ, అవార్డులు మాత్రం ఇచ్చిందంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి 20వేల లీటర్ల మంచినీరు ఇస్తున్నామని.. పల్లెలు, పట్టణాల్లో రపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తున్నామని వివరించారు. 13 రాష్ట్రాలు, కొన్ని దేశాల ప్రతినిధులు వచ్చి మిషన్‌ భగీరథను అధ్యయనం చేశాయని.. పారిశుద్ధ్యం, తాగునీరు విషయంలో కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చిందన్నారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం ఇచ్చిందంటూ ఫైర్ అయ్యారు. అయితే, కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో 35వేల చెరువులు అదృశ్యమయ్యాయంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే మిషన్‌ భగీరథ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. దీనిపై ఆచార్య జయశంకర్‌, విద్యాసాగర్‌రావుతో చర్చించామని తెలిపారు.

ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలపై కూడా కేసీఆర్ మాట్లాడారు. వరదల వల్ల నష్టపోయిన వారిని కాపాడుకుంటామని స్పష్టంచేశారు. వరదల వల్ల హైదరాబాద్‌లో తీవ్ర నష్టం జరిగితే కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. వరదల్లో బండి పోతే బండి ఇస్తాం అన్నవారు జాడ లేరంటూ ఎద్దెవా చేశారు.  7 లక్షల టన్నుల యూరియా వినియోగించే తెలంగాణ ప్రస్తుతం.. 27లక్షల టన్నులు వినియోగిస్తుందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్‌ వస్తే కరెంటు, రైతు బంధు పోతాయని ప్రజలు భయపడుతున్నారన్నారు. నష్టపోయినా.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టొద్దని నిర్ణయించుకున్నామని, దీంతో ఏటా రూ.5వేల కోట్లు నష్టపోతున్నామని వివరించారు. ధరణి వల్ల 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయని కేసీఆర్ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..