KCR: పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు.. ప్రతి ఒక్కడూ కేసీఆరే..! బీఆర్ఎస్‌లో నయా జోష్‌

|

Mar 23, 2025 | 9:19 AM

తెలంగాణ ఉద్యమాన్ని నడపడంలోనైనా.. రాష్ట్రం ఏర్పాడ్డాక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని నడపడంలోపైనా బీఆర్ఎస్‌ది వినూత్న శైలి. పదేళ్ల తర్వాత అధికారానికి దూరమై పార్టీ పరిస్థితి అగమ్యగోరంగా ఉన్న తరుణంలో అటు పార్టీ ప్రెసిడెంట్.. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ సేమ్‌ డైలాగ్స్‌తో మళ్లీ గులాబీ కేడర్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేలా పనిచేసేందుకు ప్రేరేపిస్తున్నారు.

KCR: పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు.. ప్రతి ఒక్కడూ కేసీఆరే..! బీఆర్ఎస్‌లో నయా జోష్‌
BRS Chief KCR
Follow us on

ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు.. పార్టీ ఫీనిక్స్‌.. ప్రతి ఒక్కడూ కేసీఆరే!.. పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు.. మళ్లీ బీఆర్‌ఎస్ సింగిల్‌గానే అధికారంలోకి వస్తుంది.. ఈ మాటలే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్‌ క్యాడర్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవంతో చతికిలపడిన పార్టీని ట్రాక్‌లో పెట్టేందుకు బీఆర్ఎస్‌ పెద్దలు మరో సారి వినూత్నశైలిలో ముందుకెళ్తున్నారు. మనం తెచ్చిన తెలంగాణ.. మన పాలనలోనే బాగుంది.. మళ్లీ మనమే వస్తాం అంటూ కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు కేసీఆర్‌. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని నుంచి పాదయాత్రతో కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఫాంహౌస్‌లో పాదయాత్ర చేసిన బృందంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశమయ్యారు. ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు కూడా గెలిచేవారు కాదని.. కానీ రాష్ట్రంలో ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్.

ఎవరూ శాశ్వతంగా ఉండిపోరని.. ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్‌లా తయారు కావాలన్నారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయని, తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని..కానీ ఇప్పుడు అదే తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు.తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని..కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వీడియో చూడండి..

సూర్యాపేట బీఆర్ఎస్‌ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఫీనిక్స్‌ పక్షిని ఉదహరిస్తూ ఇదే తరహాలో మాట్లాడి కేడర్‌లో జోష్‌ నింపారు.

మంత్రి సీతక్క కౌంటర్‌..

వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనని ఓవైపు కేసీఆర్, కేటీఆర్‌ కార్యకర్తలకు భరోసా ఇస్తుంటే.. మీ కేడర్‌ను ఊహాలోకంలో ఉంచండి.. మీరు ఫామ్‌హౌస్‌లోనే ఉండండి.. మీరు ఎప్పటికీ అవే కలలు కంటూ ఉండండి అంటూ మంత్రి సీతక్క కౌంటర్‌ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..