Heart Donation: తాను మరణిస్తూ మరొకరి ప్రాణం పోస్తున్న కానిస్టేబుల్ గుండె.. 11 కిలో మీటర్ల దూరం.. 13 నిమిషాల్లో చేరిన వైనం

Heart Donation: అనుకోకుండా జరిగిన ప్రమాదంతో కానిస్టేబుల్ వీరబాబుకి 34 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. కన్నవారికి, అయినవారికి తీరని శోకాన్ని మిగులుస్తూ తిరిగిలోకానికి వెళ్ళిపోయాడు. అయితే తాను వెళ్తూ.. మరోకరి గుండె చప్పుడుగా మారాడు. మరో వ్యక్తిని ఆయుస్సు..

Heart Donation: తాను మరణిస్తూ మరొకరి ప్రాణం పోస్తున్న కానిస్టేబుల్ గుండె.. 11 కిలో మీటర్ల దూరం.. 13 నిమిషాల్లో చేరిన వైనం
Heart Donation
Follow us

|

Updated on: Sep 15, 2021 | 2:28 PM

Heart Donation: అనుకోకుండా జరిగిన ప్రమాదంతో కానిస్టేబుల్ వీరబాబుకి 34 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. కన్నవారికి, అయినవారికి తీరని శోకాన్ని మిగులుస్తూ తిరిగిలోకానికి వెళ్ళిపోయాడు. అయితే తాను వెళ్తూ.. మరోకరి గుండె చప్పుడుగా మారాడు. మరో వ్యక్తిని ఆయుస్సు పోశాడు. అవయవదాతగా నిలిచాడు కానిస్టేబుల్ వీరబాబు.  వీరబాబు కానిస్టేబుల్ గా హైదరాబాద్ లోని కొండాపూర్ లో 8th బెటాలియన్ లో విధులను నిర్వహిస్తున్నాడు. పనిమీద ఖమ్మం వెళ్లిన వీరిబాబుకు అక్కడ జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. యాక్సిడెంట్ లో గాయపడిన వీరబాబుకి మలక్ పేట్ యశోద లో చికిత్సనందిస్తున్నారు. అయితే వీరబాబు బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వీరబాబు కుటుంబ సభ్యులు గుండెను దానం ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో వైద్యులు వీరబాబు గుండెను నిమ్స్ ఆసుపత్రి లో ఉన్న పేషెంట్ కి అమర్చిడానికి ఏర్పాట్లు చేశారు.

ఈ నేపథ్యంలో మలక్ పేట్ లోని యశోద ఆస్పత్రి నుంచి నుంచి గుండెను అంబులెన్స్ లో నిమ్స్ కు తరలించారు.  11కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించిన ఈ అంబులెన్స కేవలం 13నిమిషాల్లోనే నిమ్స్ కు చేరుకుంది. ఇలా తక్కువ సమయంలోనే గుండెను తరలించడానికి పోలీసులు ముందుగా పక్కాగా ప్రణాళిక సిధ్దం చేసుకున్నారు.

అంబులెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మలక్ పేట్ నుండి నిమ్స్ వరకు ఉన్న అన్ని ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల సమన్వయంతో తక్కువ సమయంలోనే గుండెను నిమ్స్ కు తరలించారు, ఈ కార్యక్రమాన్ని మలక్ పేట్ ట్రాఫిక్ సీఐ జ్యోత్స  పర్యవేక్షించారు. నిమ్స్ లోని గుండె వ్యాధితో బాధపడుతున్న రోగిని అమర్చనున్నారు.

ఇదే విషయంపై గుండె దాత కానిస్టేబుల్ వీరబాబు అన్నయ్య నాగేశ్వర్ రావ్ టీవీ 9 తో మాట్లాడుతూ.. తన తమ్ముడు చిన్నప్పటి నుంచి ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచనతోనే ఉండేవాడని చెప్పారు. ఖమ్మం లో బస్ ఆక్సిడెంట్ లో మా తమ్ముడు వీరబాబు తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో జీవన్ దాన్ వాళ్ళు గుండె మార్పడి కి సంబంధించి మమ్మలిని సంప్రదించారు. మేము మా తమ్ముడు మా నుంచి దూరం అయిన ప్రాణాలతో ఇంకొకరి రూపం లో బతికే ఉంటాడని.. గుండెను దానంగా ఇవ్వడానికి అంగీకరించినట్లు చెప్పారు.

Also Read: Sucess Story: వ్యర్ధాలకు రూపం ఇస్తూ యూట్యూబ్ చూసి పాత డ్రమ్స్, టైర్స్‌తో ఫర్నిచర్ తయారీ.. నెలకు లక్షల్లో ఆదాయం..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!