Bonalu 2022: బోనాల ఉత్సవాల్లో బ్యాడ్మింటన్‌ క్వీన్‌.. అమ్మవారికి బంగారు బోనం సమర్పణ..

|

Jul 24, 2022 | 3:23 PM

PV Sindhu: భాగ్యనగరంలో ఆషాడం బోనాలు వేడుకగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాల వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఇక ఎప్పటిలాగే పాతబస్తీలోని లాల్‌ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది...

Bonalu 2022: బోనాల ఉత్సవాల్లో బ్యాడ్మింటన్‌ క్వీన్‌.. అమ్మవారికి బంగారు బోనం సమర్పణ..
Pv Sindhu
Follow us on

PV Sindhu: భాగ్యనగరంలో ఆషాడం బోనాలు వేడుకగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాల వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఇక ఎప్పటిలాగే పాతబస్తీలోని లాల్‌ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సామాన్య భక్తులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కాగా భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (PV Sindhu) అమ్మవారి బోనాల ఉత్సవాల్లో సందడి చేసింది. ఈసారి ఏకంగా బంగారు బోనం నెత్తిన పెట్టుకొచ్చి సింహవాహిని అమ్మవారికి సమర్పించింది.భారత స్టార్ షట్లర్ పీవీ సింధు లాల్​దర్వాజ అమ్మవారి బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. నెత్తిన బంగారు బోనం ఎత్తుకొచ్చి సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించారు. కాగా ఏటా అమ్మవారికి బోనం సమర్పించే సింధు.. గతేడాది మాత్రం బోనాల ఉత్సవాలకు హాజరుకాలేకపోయింది. .బ్యాడ్మింటన్‌ టోర్నీలో బిజీగా ఉండడమే దీనికి కారణం. అందుకే ఈసారి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిందీ బ్యాడ్మింటన్‌ క్వీన్‌. ఈ సందర్భంగా సింధును ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది.

ఇకపై ఏటా వస్తా..

‘నాకు భాగ్యనగరం బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటాను. కానీ గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల పాల్గొనలేకపోయాను. ఈసారి అమ్మకు బంగారు బోనం సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై తప్పకుండా ఏటా బోనాల ఉత్సవాలకు హాజరవుతాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది మన స్టార్‌ షట్లర్‌. కాగా లండన్‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ కోసం నేడు ఇంగ్లండ్‌కు బయలుదేరనుంది. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో ఈ ప్రతిష్ఠాత్మక పోటీలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..