BJP: తెలంగాణపై బీజేపీ ప్రత్యేక ఫోకస్‌.. 2024 టార్గెట్‌గా బీజేపీ పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన

|

Jul 05, 2022 | 6:00 PM

BJP Parliament Pravas Yojana: కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతాపార్టీ (BJP) మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు..

BJP: తెలంగాణపై బీజేపీ ప్రత్యేక ఫోకస్‌.. 2024 టార్గెట్‌గా బీజేపీ పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన
Follow us on

BJP Parliament Pravas Yojana: కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతాపార్టీ (BJP) మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. 2024 టార్గెట్‌గా బీజేపీ పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన చేపట్టింది. 144 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. తెలంగాణలోని పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రవాస్‌ యోజన ప్లాన్‌ అమలు చేయనున్నారు. రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేశారు. 40 మంది కేంద్ర నేతలకు ఈ క్లస్టర్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు, ఎంపీలు పర్యటిస్తారు. మూడు రోజులపాటు నియోజకవర్గాల్లోనే బస చేస్తారు. ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ అమలు చేయనున్నారు.

మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కార్యాచరణ రెడీ చేయనున్నారు. మరోవైపు కొత్తగా నియమించిన కమిటీల బాధ్యతలను కన్వీనర్లకు అప్పగించనున్నారు. చేరికల కమిటీ కన్వీనర్‌గా ఈటల రాజేందర్‌ తన కమిటీతో సమావేశమవుతారని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఈనెల 2,3వ తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో రెట్టింపు ఉత్సాహంలో బీజేపీ మరిన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోయినా.. ఈ ఉత్సాహం పార్టీ కేడర్‌లో మెయిన్‌టెయిన్‌ చేయడానికి బీజేపీ హైకమాండ్‌ అన్ని చర్యలూ చేపడుతోంది. ఇందులో భాగమే ఈ పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేలా కార్యచరణ సిద్ధం చేస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి తీసుకున్న నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు కార్యచరణ సిద్ధం రూపొందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని పొలిటిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి