Maha Cheating: నయా ఎత్తుగడ.. పార్టీలో సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు..!
Maha Cheating: ఇది చీటింగ్ కాకపోతే మరేంటి? పార్టీలో సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ మహిళలను మభ్యపెట్టాడో వ్యక్తి. దీంతో పార్టీ..
Maha Cheating: ఇది చీటింగ్ కాకపోతే మరేంటి? పార్టీలో సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ మహిళలను మభ్యపెట్టాడో వ్యక్తి. దీంతో పార్టీ ఆఫీస్ ముందు భారీగా క్యూలైన్లు వెలిశాయి. మహిళలు, చిన్నారులతో సహా పెద్ద ఎత్తు ఆ పార్టీలో చేరేందుకు తరలివస్తున్నారు. ఇది చీటింగే అంటున్నారు జనం. ఈ కొత్త పార్టీ నయా ఎత్తుగడతో రవీంద్రభారతి పక్కన రోడ్డు మొత్తం బ్లాకైంది. రెడ్ హిల్స్‌లో మహిళలు క్యూలు కడుతున్నారు. చిన్నారులు.. వృద్ధులు కూడా క్యూల్లో నిలబడి పార్టీ సభ్యత్వం తీసుకోడానికి వేచిచూస్తున్నారు.
ఇంతకీ ఆ పార్టీ పేరు జై మహా భారత్ పార్టీ. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ఈ పార్టీ.. జనాలను ఆకర్షించడానికి ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తాం అన్నారని మహిళలు చెబుతున్నారు. రెండు ఫోటోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీస్కుని పార్టీ మెంబర్ షిప్ ఇస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పార్టీ నుంచి ఒక్కో మహిళకు 200 గజాల స్థలం ఇస్తామంటోంది జైమహాభారత్ పార్టీ.
ఇతర ప్రాంతాల నుంచి జనం తరలివస్తుండడంతో.. జనాల తాకిడికి న్యూ సెన్సు అవుతుంది అని సైఫాబాద్ పీఎస్‌లో ఫిర్యాదులందాయి. గత మూడు నెలలుగా 5 లక్షల మంది పార్టీ మెంబర్ షిప్ నమోదు చేసినట్టు కార్యకర్తలు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి