YSR Vahan Mitra Scheme: జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌లో దరఖాస్తు చేసుకుంటే రూ.10వేల ఆర్థిక సాయం

YSR Vahan Mitra Scheme: ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పేదలకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు..

YSR Vahan Mitra Scheme: జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌లో దరఖాస్తు చేసుకుంటే రూ.10వేల ఆర్థిక సాయం
AP Government
Follow us

|

Updated on: Jul 05, 2022 | 4:34 PM

YSR Vahan Mitra Scheme: ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పేదలకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. నవరత్నల్లో భాగంగా వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌ ద్వారా అర్హులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈనెల 13న అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌ డ్రైవర్‌ కమ్‌ ఓనర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు రవాణా శాఖ కమిషనర్‌ రాజబాబు తెలిపారు. అలాగే వాహణాల ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌, మరమ్మతుల నిమిత్తం నగదు సాయం అందిస్తు్న్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.

ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

ఈ పథకానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, ఈనెల 7 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్దిదారుల ఎంపిక అనేది పారదర్శకంగానే జరుగుతుందని, దరఖాస్తుదారుడు తనకు సంబంధించిన భూమి, ఆస్తి వివరాలు, ఆస్తి పన్ను కట్టిన వివరాలు, విద్యుత్‌ వినియోగం, ఆదాయపు పన్ను, కులం వివరాలు అందించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందుతున్నవారు వాహనంతో నిలబడిన ఫోటోను గ్రామ సచివాలయంలో అప్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. వాహనదారులు ఆధార్‌, తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండాలన్నారు. అంతేకాకుండా దరఖాస్తుదారుడు విద్యుత్‌ వినియోగం సగటున ఆరు నెలల మీద నెలసరి 300 యూనిట్లు దాటితే పథకానికి అనర్హులుగా నిర్ధారించనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..