పార్లమెంటును విపక్షాలు అవమానించాయి.. ఎర్రకోట సూత్రదారులెవరో బయటకొస్తారన్న మురళీధర్‌రావు
రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని..

రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కిరించి పార్లమెంటరీ వ్యవస్థను అగౌరవపరిచాయన్నారు. పార్లమెంట్‌లో చట్టంచేశాక కూడా రైతుల వాదన వినేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వం చరిత్రలో ఎక్కడా లేదన్నారు మురళీధర్‌రావు.
గణతంత్ర దినోత్సవం నాడు రైతుల విజ్ఞప్తిని మన్నించి ర్యాలీకి అనుమతిస్తే ఏం జరిగిందో దేశమంతా చూసిందన్నారు. విపక్షంగా విఫలమైన కాంగ్రెస్ కుట్రల్లో నెగ్గుకొస్తోందని మురళీధర్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ ప్రభుత్వం దీనికి మద్దతిచ్చిందన్నారు. ఎర్రకోటపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర త్వరలోనే బయటికొస్తుందని చెప్పారు.
అయోధ్య రామమందిరం కోసం దేశవ్యాప్తంగా ప్రశాంతంగా విరాళాల సేకరణ జరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోందని మురళీధర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటి యుద్ధం చేయకుండా.. దమ్ముంటే ముందుకొచ్చి పార్టీ విధానమేంటో చెప్పాలని సవాల్ విసిరారు.