అందరూ ఐక్యంగా డీలిమిటేషన్‌పై పోరాడాలి.. తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు..
ఇవాళ్టి చెన్నై అఖిలపక్షంలో ఇదే వాయిస్ వినిపించారు తమిళనాడు సీఎం స్టాలిన్. జనాభా ప్రతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే.. దక్షిణాదితోపాటు కొన్ని రాష్ట్రాలకు ఎంత నష్టం జరుగుతుందో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి.

తమిళనాడులో ప్రస్తుతం 39 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు చేపట్టే జనాభా లెక్కల ఆధారంగా సీట్లు ఖరారు చేస్తే తమిళనాడులోనే 8 నుంచి 12 సీట్లు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు స్టాలిన్. రాష్ట్రాల హక్కులు తగ్గిపోతాయని, రాజకీయంగానూ వాయిస్ వినిపించే పరిస్థితి ఉండదని కూడా గుర్తు చేశారు. ఇక్కడే మణిపూర్ అంశాన్నీ ప్రస్తావించారు స్టాలిన్. రెండేళ్లుగా మణిపూర్ తగలబడిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, రాజకీయంగా వాళ్లకు సరైన బలం లేకపోవడం వల్లే మణిపూర్ హింస ఎవరికీ పట్టడం లేదని అన్నారు. ఉత్తరాదిన సీట్లు పెరిగి దక్షిణాదిన సీట్లు తగ్గితే ఇలాంటి పరిస్థితే వస్తుందని.. అందరూ ఐక్యంగా డీలిమిటేషన్‌పై పోరాడాలన్నారు.
సీట్లు తగ్గితే సౌత్ అభిప్రాయానికి విలువ లేకుండా పోతుందని, మన ప్రాతినిథ్యం తగ్గడం వల్ల.. మన గురించి అవగాహన లేని వాళ్లు మనపై వాళ్ల అభిప్రాయాన్ని రుద్దుతారని అన్నారు స్టాలిన్. పారదర్శకంగా పునర్విభజన చేపట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. చెన్నైలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ కూడా మీటింగ్‌కి వచ్చారు. BRS నుంచి కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలు ముగ్గురు హాజరయ్యారు.