Central Govt: దేశంలోని ఐదురాష్ట్రాలకు విపత్తు సాయం ప్రకటించిన కేంద్రం.. తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించారంటే..
Central Govt: 2020లో భారీ వర్షాల కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం విడుదల చేసింది.

Central Govt: 2020లో భారీ వర్షాల కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం విడుదల చేసింది. ఆ మేరకు శుక్రవారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ నిధుల నుంచి ఈ సాయం విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా 2020 సంవత్సరంలో నైరుతి రుతుపవనాల సమయంలో వచ్చిన వరద కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు సాయం అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా దేశంలోని ఐదు రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ నిధుల నుంచి రూ. 1,751.05 కోట్లు మంజూరు చేశారు. కేంద్రం ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. తెలంగాణకు కేంద్రం రూ.245.96 కోట్లు మంజూరు చేయగా.. అస్సాంకు రూ.437.15, అరుణాచల్ ప్రదేశ్‌కు రూ.75.86 కోట్లు, ఒడిశాకు రూ.320.94 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు 386.06 కోట్లు చొప్పున కేంద్రం మంజూరు చేసింది.
Also read:
Viral News: ప్రియురాలి పెళ్లికి హాజరైన మాజీ ప్రియుడు.. స్టేజీ మీదకు రాగానే ఆ వధువు ఏం చేసిందంటే..